Begin typing your search above and press return to search.

మహావతార్.. ‘హనుమాన్ అంశ్’ ఎంత లాగుతుందో!

అయితే మహావతార్ చిత్రానికి, దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ మూవీలో 3డీ యానిమేషన్, నరసింహ స్వామి ఉగ్ర రూపం లాంటి పక్కా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి.

By:  M Prashanth   |   8 Oct 2026 10:34 AM IST
మహావతార్.. ‘హనుమాన్ అంశ్’ ఎంత లాగుతుందో!
X

'మహావతార్ నరసింహ' తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రిలీజ్ రోజున కేవలం 30 లక్షల నెట్ కలెక్షన్స్ తో మొదలైన ఈ డబ్బింగ్ యానిమేషన్ చిత్రం.. లాంగ్ రన్ లో ఏకంగా 49.3 కోట్ల భారీ మార్క్ టచ్ చేసి ట్రేడ్ వర్గాలకు మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ అండతో బాక్సాఫీస్ దగ్గర ఒక ఊహించని సక్సెస్ స్టోరీని రాసిపెట్టింది.

ఇప్పుడు సరిగ్గా అదే బాటలో మరో సాలిడ్ డివోషనల్ కంటెంట్ తో హోంబలే ఫిల్మ్స్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిందీలో సైలెంట్ గా విడుదలై రికార్డులు బద్దలు కొట్టిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్ అక్టోబర్ 9న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. నార్త్ లో తొలి వారం కదలిక లేకపోయినా.. ఆ తర్వాత మౌత్ టాక్ తో పుంజుకుని ఏకంగా 425 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ (327 కోట్ల ఇండియా నెట్) రాబట్టి ట్రేడ్ ను షేక్ చేసింది.

టాలీవుడ్ మార్కెట్ పరంగా ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే.. దీనికి ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల బొమ్మ అనే పవర్ ఫుల్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. పైగా పాన్ ఇండియా ఆడియన్స్ నాడి పట్టిన హోంబలే బ్యానర్ స్వయంగా దీనిని తెలుగులో రిలీజ్ చేస్తుండటం సినిమాకు గట్టి హైప్ తీసుకొచ్చింది. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఆ సంస్థకు తెలుగు ప్రేక్షకులతో ఏర్పడిన బాండింగ్ కూడా దీనికి బాగా ప్లస్ కానుంది.

అయితే మహావతార్ చిత్రానికి, దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ మూవీలో 3డీ యానిమేషన్, నరసింహ స్వామి ఉగ్ర రూపం లాంటి పక్కా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ హనుమాన్ అంశ్ పూర్తిగా నీమ్ కరోలి బాబా జీవితం, ఆధ్యాత్మికత చుట్టూ సాగే ప్రశాంతమైన ఎమోషనల్ జర్నీ. పైగా హిందీలో రిలీజైన రెండు నెలల తర్వాత వస్తుండటంతో, మొదటి రోజే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

అంచనాల ప్రకారం చూసుకుంటే.. తెలుగు వెర్షన్ కు ఫైనల్ రన్ లో 18 నుంచి 20 కోట్ల నెట్ వసూళ్లు వస్తే సూపర్ హిట్ అయినట్లే. ఒకవేళ ఫ్యామిలీస్ తో పాటు డివోషనల్ ఆడియన్స్ గట్టిగా ఓన్ చేసుకుంటే మాత్రం 30 కోట్ల టార్గెట్ ఈజీగా దాటే ఛాన్స్ ఉంది. కానీ మహావతార్ కలెక్ట్ చేసిన 49 కోట్ల రేంజ్ కు వెళ్లాలంటే మాత్రం సెకండ్, థర్డ్ వీక్స్ లో కూడా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ లేకుండా లాంగ్ రన్ లో సత్తా చాటాలి.

హిందీలో ఒక స్లో బర్నర్ లా మొదలై ఇండస్ట్రీ హిట్ స్థాయికి వెళ్లిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు నాట అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది అందరిలో ఉన్న క్యూరియాసిటీ. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఎన్నోసార్లు రుజువైంది. మరి టాలీవుడ్ భక్తి మార్కెట్ స్టామినా ఏంటో, హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో రేపు ఉదయానికే క్లారిటీ వచ్చేస్తుంది.