డార్లింగ్ మూవీలో కన్నడ బ్యూటీ
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫ్యాన్స్ కు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఆయా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందించి వారిని ఫుల్ ఖుషీ చేశారు
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 8:44 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫ్యాన్స్ కు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఆయా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందించి వారిని ఫుల్ ఖుషీ చేశారు. అయితే ఈ ఇయర్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వచ్చిన అప్డేట్స్ లో అందరినీ విపరీతంగా ఆకర్షించింది ఫౌజీ మూవీ.
ఫౌజీ ఫస్ట్ లుక్ తో ఫుల్ ఖుషీగా ప్రభాస్ ఫ్యాన్స్
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ప్రభాస్ చాలా కొత్త అవతారంలో కనిపించగా, ఆ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఫౌజీలో చైత్ర జై. ఆచార్
యుద్ధ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని ఆల్రెడీ లీకులందాయి. ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో నటి కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. కన్నడ నటి, సింగర్ చైత్ర జై. ఆచార్.. ఫౌజీలో ఓ కీలక పాత్రలో నటించానున్నారట. చైత్ర గతంలో సప్త సాగరాలు దాటి, 3BHK లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
హను సృష్టించిన అందమైన ప్రపంచం ఫౌజీ
ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు తాను ఫౌజీలో భాగమైనట్టు కన్ఫర్మ్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న అందమైన సృష్టి ఫౌజీ అని చైత్ర చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఈ అప్డేట్ మరింత ఎగ్జైట్ చేస్తోంది. పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీని హను రాఘవపూడి ఎంతో గ్రాండ్ గా, మరింత ఎమోషనల్ గా చెప్తున్నారని.. మూవీలో ప్రేమ, త్యాగం, దేశభక్తి అన్నింటినీ కలగలిపి ఓ విజువల్ పోయెట్రీగా తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఫౌజీని వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
