Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని..!

ప్రముఖ నటి హన్సిక మోత్వాని.. వ్యాపారవేత్త సోహెల్ ఖతురియా తమ నాలుగేళ్ల వివాహ జీవితాన్ని పరస్పర అంగీకారంతో ముగించాలని నిర్ణయించుకున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 March 2026 5:26 PM IST
విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని..!
X

ప్రముఖ నటి హన్సిక మోత్వాని.. వ్యాపారవేత్త సోహెల్ ఖతురియా తమ నాలుగేళ్ల వివాహ జీవితాన్ని పరస్పర అంగీకారంతో ముగించాలని నిర్ణయించుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తరువాత ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం వెలువడింది. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా..సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తోంది.

హన్సిక.. సోహెల్ 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో అతి వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మెహంది, సంగీత్, హల్దీ వంటి సంప్రదాయ వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. వారి పెళ్లి ఫోటోలు.. వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ జంట ప్రేమకథను ఆధారంగా తీసుకుని “హన్సికస్ లవ్ షాది డ్రామా” అనే రియాలిటీ షో కూడా ఓటీటీలో పాపులర్ అయ్యింది. అందులో వారి ప్రేమ, పెళ్లి ఏర్పాట్లు.. కుటుంబ సభ్యులతో ఉన్న బంధం ప్రేక్షకులకు చూపించారు. ఈ షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది.

అయితే గత కొంతకాలంగా ఈ జంట మధ్య సమస్యలు.. ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫోటోలను తొలగించడం వల్ల విడాకులపై ఊహాగానాలు పెరిగాయి. కొన్ని నివేదికల ప్రకారం..గత కొన్ని నెలలుగా వీరు విడిగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా హన్సిక ఈ విడాకుల సందర్భంలో ఎలాంటి భరణం తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా, హన్సిక తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ భారత సినిమా పరిశ్రమలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొత్త సినిమాలు, వెబ్ ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.