ఆమెకు విడాకులతో స్వేచ్ఛ లభించిందట!
ఇప్పటి వరకు హన్సిక, సోహైల్ విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ఎక్కడా రాలేదు. కానీ తాను సింగిల్ అంటూ హన్సిక అధికారికంగా ప్రకటించింది.
By: Ramesh Palla | 17 April 2026 7:00 PM ISTటాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తూనే ఉంది. ఈమె గురించిన వార్తలు ఎప్పుడూ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య సోహైల్‌తో వివాహం సందర్భంగా పతాక స్థాయిలో ఈమె గురించిన వార్తలు వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక గురించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్త కథనాలు ప్రచురించిన విషయం తెల్సిందే. పెళ్లి అయిన కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు హన్సిక, సోహైల్ విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ఎక్కడా రాలేదు. కానీ తాను సింగిల్ అంటూ హన్సిక అధికారికంగా ప్రకటించింది.
వైవాహిక జీవితంపై హన్సిక క్లారిటీ...
ఇటీవల అభిమానులతో చిట్‌చాట్ సందర్భంగా హన్సిక తాను ఒంటరి జీవితంను గడుపుతున్నట్లు చెప్పింది. అంతే కాకుండా ఒంటరితనం సంతోషాన్ని ఇస్తోందని కూడా చెప్పింది. ఇప్పుడు తాను చాలా స్వేచ్ఛగా ఉన్నట్లుగా కూడా హన్సిక పేర్కొంది. దాంతో విడాకుల తర్వాత హన్సిక స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది అంటూ సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పదే పదే హన్సిక వైవాహిక జీవితం గురించిన వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కనుక విడాకులు కేవలం పుకార్లే అయ్యి ఉంటాయని అంతా భావించారు. కానీ ఒంటరితనం, స్వేచ్ఛ అంటూ హన్సిక సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఈమె విడాకులు తీసుకుందని, లేదంటే విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతుంది అంటూ బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో....
హన్సిక హీరోయిన్‌గా పలు భాషల్లో సక్సెస్ అయింది. తెలుగులో ఈమె దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా చిన్న వయసులోనే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే టాలీవుడ్‌లో ఈమెకు టాప్ హీరోలకు జోడీగా ఆ తర్వాత నటించే అవకాశం తక్కువగా వచ్చింది. దాంతో టాప్ హీరోయిన్స్‌ల జాబితాలో ఈమె ఎక్కువ కాలం నిలవలేదు అనేది వాస్తవం. అందుకే ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఆ తర్వాత కాలంలో ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది. చిన్నా చితక సినిమాలు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా టాలీవుడ్‌కి ఈమె గెస్ట్ గానే మారింది. అయినా కూడా ఈమె తమిళ్ మూవీస్ తెలుగులో డబ్ కావడం వల్ల ఎప్పుడూ తెలుగు మీడియాలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయిన కూడా ఈమెకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం మాత్రం లభిస్తూనే ఉంది.
తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలోనూ...
1991లో జన్మించిన హన్సిక బాల నటిగా మొదట హిందీ సినిమాలో నటించింది. తెలుగులో ఈమె చేసిన దేశ ముదురు, కంత్రి, మస్కా సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇక తమిళ్‌లో ఈమె మాప్పిళ్లై సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సినిమా తర్వాత ఎంగేయుమ్ కాదల్, వేలాయుధం, ఒరు కల్ ఒరు కన్నాడి సినిమాలు చేసింది. మలయాళంలోనూ ఈమె నటించింది. మలయాళ సినిమా విలన్‌తో ఈమెకు నటిగా మంచి గుర్తింపు దక్కింది. హన్సిక తండ్రి ప్రదీప్ వ్యాపారవేత్త కాగా, తల్లి డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి కనబర్చిన హన్సికకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లోనూ హన్సిక కనిపించింది. మోడలింగ్‌తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హన్సిక సౌత్ లో అన్ని భాషల్లోనూ హిందీలోనూ సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్ జాబితాలో చేరింది. కెరీర్ పరంగా సూపర్ హిట్ అయిన హన్సిక పాపం వ్యక్తిగత విషయంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
