Begin typing your search above and press return to search.

సెల‌బ్రీటీల‌ పెళ్లిళ్లు..విడాకులు..ఓటీటీల ప‌రిస్థితేంటీ?

ప్ర‌తి కుటుంబంలోనూ పెళ్లికి మించిన వేడుక లేదు. కింది స్థాయి నుంచి మిలియ‌నీర్‌లు, సెల‌బ్రిటీల వ‌ర‌కు పెళ్లి అన‌గానే భారీగా ప్లాన్ చేసుకుంటారు.

By:  Ravindar Gorantla   |   13 March 2026 8:00 PM IST
సెల‌బ్రీటీల‌ పెళ్లిళ్లు..విడాకులు..ఓటీటీల ప‌రిస్థితేంటీ?
X

భార‌తీయ వివాహ వ్య‌వ‌స్థ అంటే ప్ర‌పంచం మొత్తం ఇష్ట‌ప‌డుతుంది. సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేస్తూ జ‌రిగే పెళ్లి తంతు అంటే విదేశీలు అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు. అలాంటి పెళ్లి తంతు ఇప్పుడు ప్ర‌హ‌స‌నంగా మారుతోందా? అంటే అవున‌నే నిరూపిస్తున్నారు సెల‌బ్రీటీలు. ఈ మ‌ధ్య కాలంలో విడిపోయిన‌న్న జంట‌లు మ‌రో సంద‌ర్భంలోనూ విడిపోలేదు. పెళ్లి భార‌తీయ సంస్కృతిలో ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తి కుటుంబంలోనూ పెళ్లికి మించిన వేడుక లేదు. కింది స్థాయి నుంచి మిలియ‌నీర్‌లు, సెల‌బ్రిటీల వ‌ర‌కు పెళ్లి అన‌గానే భారీగా ప్లాన్ చేసుకుంటారు.

కొంత మంది త‌మ స్థాయికి మించి ఖ‌ర్చు చేస్తూ పెళ్లి వేడుక‌ని లైఫ్ టైమ్ మెమ‌ర‌బుల్ డేగా మార్చుకుంటుంటారు. ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుని ఘ‌నంగా వివాహాలు చేసుకుంటుంటారు. క్రికెట‌ర్స్‌, సినీ సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య డెస్టినేష‌న్ వెడ్డింగ్ పేరుతో ల‌క్ష‌లు, కోట్లు ఖ‌ర్చు పెట్టి భారీ స్థాయిలో వారి అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ప్లాన్ చేసుకుని మ‌రీ వివాహాలు చేసుకుంటున్నారు. అంతేనా..ఈ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌ని కోట్ల రూపాయ‌ల‌కు ప్ర‌ముఖ ఓటీటీల‌కు అమ్మేస్తున్నారు.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌, హ‌న్సిక -సోహైల్ ఖ‌తూరియాల డెస్టినేష‌న్ వెడ్డింగ్‌లే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. వీరి వివాహ వేడుక స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీల‌కు భారీ మొత్తానికి విక్ర‌యించ‌డం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన సెల‌బ్రీటీల వివాహాలకు సైతం ప్ర‌ముఖ ఓటీటీల నుంచి భారీ ఆఫ‌ర్లు అభించినా స్ట్రీమింగ్ హ‌క్కుల్ని విక్ర‌యించ‌డానికి వారు అంగీక‌రించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఇదిలా ఉంటే డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల పేరుతో ల‌క్ష‌లు, కోట్లు ఖ‌ర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్న సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య మూడేళ్లు తిర‌క్కుండానే విడాకులు తీసుకుంటుండ‌టం చ‌ర్చ‌నీయాంవంగా మారుతోంది.

సెల‌బ్రిటీ క‌పుల్స్ కొంత మంది 18 నుంచి 26 ఏళ్ల వ‌ర‌కు సాగిన వైవాహిక జీవితానికి ముగింపు ప‌లుకుతూ విడాకులుకు వెళుతున్నారు. కోలీవుడ్‌లో కొంత మంది, బాలీవుడ్‌లో కొంత మంది ఇలా విడాకులుకు వెళ్ల‌డం పెద్ద చ‌ర్చ‌కు తెర‌తీసింది. అయితే వీట‌న్నింటికీ పూర్తి భిన్నంగా త‌మ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ని భారీ మొత్తానికి ఓటీటీల‌కు విక్ర‌యించి ఆ మొత్తాన్ని వాడేసుకున్న సెల‌బ్రిటీలు మూడేళ్ల‌కే విడాకులు తీసుకుంటే ఓటీటీల ప‌రిస్థితేంటీ?..ఆ డ‌బ్బుని తిరిగి వెన‌క్కి అడుగుతారా? .. లేక అంత మేర‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని తిరిగివ్వ‌మంటారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రీసెంట్‌గా హ‌న్సిక త‌న స్నేహితురాలి భ‌ర్త‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం తెలిసిందే. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫుటేజ్‌ని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు భారీ మొత్తానికి విక్ర‌యించారు. మూడేళ్లు తిర‌క్కుండానే హ‌న్సిక త‌న కోరి చేసుకున్న భ‌ర్త‌తో విడిపోవ‌డం, వారికి విడాకులు కూడా కోర్టు నుంచి మంజూరు కావ‌డంతో వీరి పెళ్లి వేడుక‌ని భారీ మొత్తం చెల్లించి స్ట్రీమింగ్ హ‌క్కులు తీసుకున్న ఓటీటీ ప‌రిస్థితి ఏంటీ? అనే చ‌ర్చ సోష‌ల్‌మీడియాలో జరుగుతోంది.