Begin typing your search above and press return to search.

హన్సిక మౌనమేల? ఏం జరుగుతోంది?

స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుని సత్తా చాటి కెరీర్ లో ఓ దశలో సక్సెస్ ఫుల్ గా సాగింది. ముఖ్యంగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

By:  M Prashanth   |   5 Aug 2025 11:30 AM IST
హన్సిక మౌనమేల? ఏం జరుగుతోంది?
X

హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి అందరికీ తెలిసిందే. 15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తన వైట్ స్కిన్ టోన్, మత్తెక్కించే నవ్వుతో అందరినీ ఫిదా చేసింది. కుర్రాళ్లు అంతా ఫ్లాట్ అయిపోయారు. దేశముదురు మూవీతో హీరోయిన్ గా పలకరించిన అమ్మడు.. ఆ తర్వాత వివిధ చిత్రాల్లో నటించి హిట్స్ ను సొంతం చేసుకుంది.

స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుని సత్తా చాటి కెరీర్ లో ఓ దశలో సక్సెస్ ఫుల్ గా సాగింది. ముఖ్యంగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె దూకుడుకు బ్రేక్ లు పడ్డాయి. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఏ సినిమా చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత టీవీ షోస్ లో జడ్జిగా సందడి చేశారు హన్సిక.

కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ అవకాశాలు ఆమె సొంతమయ్యాయి. ఇప్పుడు తమిళంలో రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి సినిమాలతో పాటు హిందీలో లవ్ ఎఫైర్ చిత్రంలో హన్సిక నటిస్తున్నారు అమ్మడు. అయితే ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది రోజులుగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే తమిళ హీరో శింబుతో కొంతకాలం ప్రేమాయణం నడిపిన అమ్మడు.. రేపో మాపో పెళ్లి అవుతుందని అంతా అనుకోగా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తన భర్త సొహైల్ కతూరియాతో ప్రేమలో పడిన ఆమె.. కొన్నాళ్లు ఆయనతో డేటింగ్ చేశారు. 2022 డిసెంబర్ 22న గ్రాండ్ గా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే అప్పటికే సోహైల్ కు వివాహం జరిగింది. తన భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయ్యాక.. తరచుగా వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేశారు. పిక్స్ కూడా షేర్ చేశారు. కానీ ఇప్పుడు వారిద్దరూ డివోర్స్ తీసుకోనున్నారని సోషల్ మీడియాతోపాటు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

కొన్ని నెలలుగా హన్సిక.. భర్తకు దూరంగా.. తల్లి దగ్గర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు హన్సిక రెస్పాండ్ అవ్వలేదు. అటు వార్తలను ధ్రువీకరించలేదు.. తిరస్కరించడం లేదు. అలా మౌనంగా ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఫుల్ యాక్టివ్ గా ఉండే అమ్మడు.. 2 వారాల నుంచి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.

దీంతో ఏం జరుగుతోందని నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైలెన్స్.. అభిమానులను, ఫాలోవర్స్ నిజంగా ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. అయితే కావాలని ఆమె సైలెంట్ గా ఉందేమోనని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా హన్సిక రెస్పాండ్ అవుతుందేమో చూడాలి.