Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేడుకల్లో ఇండియన్ హారర్ మేజిక్!

ప్రపంచవ్యాప్తంగా హలోవీన్ వేడుకల జోరు మొదలైన నేపథ్యంలో థ్రిల్ పంచే భయానక చిత్రాలను ఇష్టపడే సినీ ప్రియుల కోసం కొన్ని ప్రత్యేకమైన సినిమాలు క్యూ కట్టాయి.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 8:00 AM IST
అంతర్జాతీయ వేడుకల్లో ఇండియన్ హారర్ మేజిక్!
X

ప్రపంచవ్యాప్తంగా హలోవీన్ వేడుకల జోరు మొదలైన నేపథ్యంలో థ్రిల్ పంచే భయానక చిత్రాలను ఇష్టపడే సినీ ప్రియుల కోసం కొన్ని ప్రత్యేకమైన సినిమాలు క్యూ కట్టాయి. సాధారణంగా హలోవీన్ అనగానే విదేశీ దెయ్యాల కథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి భారతీయ క్లాసిక్స్ నుంచి హాలీవుడ్ భయానక చిత్రాల వరకు అన్నీ కలిపి పర్ఫెక్ట్ వాచ్‌లిస్ట్ సిద్ధమైంది. భయంతో వెన్నులో వణుకు పుట్టించే అగ్రశ్రేణి చిత్రాల విశేషాలు ఏంటో చూద్దాం.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న `తుంబాడ్`. దురాశ నేపథ్యంలో సాగే పీరియాడిక్ హారర్ డ్రామా ప్రేక్షకులను ఓ సరికొత్త భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన `భూత్`చిత్రం గురించి చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగన్, ఊర్మిళ జంటగా నటించిన ఈ సైకలాజికల్ హారర్ సినిమా విడుదలైన రోజుల్లో సంచలనం సృష్టించింది.

కామెడీతో పాటు భయన్ని పంచే ప్రియదర్శన్ చిత్రం `బూల్ బులయ్యా` ఎప్పటికీ ఎవ్వ‌ర్ గ్రీనే. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ అద్భుత నటనతో చిత్రం క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాగే బిపాసా బసు నటించిన `రాజ్` బాలీవుడ్‌లో హారర్ జోనర్‌కు సరికొత్త ఊపు తెచ్చింది. ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథాత్మక భయానక చిత్రం నాటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. వీటితో పాటు టెలివిజన్ వేదికగా భయపెట్టే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం `13B` కూడా ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మాధవన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో టీవీలో వచ్చే సీరియల్ నిజ జీవితంలో జరగడం అనే యూనిక్ పాయింట్ ప్రేక్షకులను కట్టపడేస్తుంది.

హాలీవుడ్ నుంచి `ది కంజురింగ్` , `హెరిడిటరీ` వంటి సినిమాలు నిజమైన దెయ్యాల అన్వేషణ, ప్రయోగాల ఆధారంగా భయానక అనుభూతిని ఇస్తాయి. ఇటీవలి కాలంలో వచ్చిన అజయ్ దేవగన్ `శైతాన్`, మమ్ముట్టి నటించిన బ్లాక్ అండ్ వైట్ పీరియడ్ హారర్ డ్రామా `భ్రమయుగం` సినిమాలు కూడా ఈ జాబితాలో చేరి ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. మూఢనమ్మకాలు, చేతబడులు, పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాలు హలోవీన్ రాత్రిని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. విదేశీ చిత్రాలకే పరిమితం కాకుండా మన దేశీయ సంస్కృతి, పురాణాలు .. అతీంద్రియ శక్తుల ఆధారంగా తెరకెక్కిన అద్భుతమైన 10 హారర్ సినిమాలను హలోవీన్ రాత్రిలో వీక్షించడం ద్వారా సరికొత్త థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు. ప్రేమికులకు ఈ చిత్రాలు మంచి అనుభూతిని ఇస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.