వచ్చే ఏడాది అవార్డులన్నీ ఆ సినిమాకేనట
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాపై జీవీ ప్రకాష్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
By: M Prashanth | 2 Dec 2025 12:00 AM ISTసినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ గా చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇస్తూనే, మరోపక్క నటుడిగా కూడా అలరించడం అందరివల్లా కాదు. కానీ కోలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. లేటెస్ట్ గా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. జీవీ ప్రకాష్ కుమార్ ప్రస్తుతం సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా జోన్ లో ఉంటుందని, ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని చెప్పారు. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాపై జీవీ ప్రకాష్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా అవుట్ పుట్ చూస్తుంటే వచ్చే ఏడాది జాతీయ అవార్డులన్నీ దీనికే వస్తాయని చెప్పారు. పవన్ సాదినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్ లా ఉండబోతోందని అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా, మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తిగా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ఇదే సందర్భంలో అటు నటన, ఇటు సంగీతం రెండూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నటన అనేది శారీరక శ్రమతో కూడుకున్నదని, దానికి 60 రోజుల కాల్షీట్లు అవసరమని అన్నారు. అదే సంగీతం విషయానికి వస్తే అది పూర్తిగా మెంటల్ వర్క్ అని, క్రియేటివిటీకి సంబంధించినదని చెప్పుకొచ్చారు. రెండూ వేర్వేరు అయినప్పటికీ, మంచి ప్లానింగ్ తో వాటిని మేనేజ్ చేస్తున్నానని తెలిపారు.
ప్రస్తుతం జీవీ ప్రకాష్ నాలుగు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. లక్కీ భాస్కర్, అమరన్ వంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న జీవీ, ఇప్పుడు సూర్య, దుల్కర్ సినిమాలతో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే, రాబోయే రోజుల్లో మ్యూజికల్ గానే కాకుండా కంటెంట్ పరంగా కూడా పెద్ద హిట్స్ చూడబోతున్నామనిపిస్తోంది.
