ట్రైలర్: విజయ్ వర్మ ఈమెతో ప్రేమలో పడ్డాడేమిటి?
పైగా కవితలు నేర్చుకోవడానికి వచ్చి ప్రేమలో పడే కుర్రాడి కథను తెరపై చూపించడం అంటే, నిజంగానే హృదయాన్ని పదే పదే తాకే సన్నివేశాలకు కొదవేమీ ఉండదు.
By: Sivaji Kontham | 12 Nov 2025 9:27 AM ISTకొన్ని దృశ్యాలు మనసు మీద ఘాడమైన ముద్ర వేస్తాయి. కళాత్మక హృదయాల నుంచి పుట్టుకొచ్చే ప్రతిదీ గుండెను మీటుతుంది. పైగా కవితలు నేర్చుకోవడానికి వచ్చి ప్రేమలో పడే కుర్రాడి కథను తెరపై చూపించడం అంటే, నిజంగానే హృదయాన్ని పదే పదే తాకే సన్నివేశాలకు కొదవేమీ ఉండదు. అలాంటి ఒక కథలో విజయ్ వర్మ నటించాడు. అతడికి జోడీగా `దంగల్` ఫేం ఫాతిమా సనా షేక్ నటించగా, కీలకమైన ఉర్దూ కవి పాత్రలో నసీరుద్ధీన్ షా నటించారు.
ఇంతకీ గురువు నసీరుద్ధీన్ షాను కలిసిన తర్వాత విజయ్ నిజంగా కవితలే నేర్చుకున్నాడా? లేక అతడి కుమార్తెతో ప్రేమలో నిండా మునిగాడా? అన్నది తెరపైనే చూడాలి. అయితే ప్రతి ప్రేమకథలోను ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. కవితలు నేర్చుకునేవాడికి తిండి దొరుకుతుందా? పోయెట్రీ కూడు పెడతుందా? అంటే.. ఆ మనిషి ఆర్థికంగా దిగజారడానికి సహకరిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా విజయ్ వర్మ కవితలు నేర్చుకునే క్రమంలో అతడి ఆర్థిక పరిస్థితి ధైన్యంగా మారుతుంది. అప్పు ఇచ్చిన రుణధాత నుంచి థ్రెట్ ఎదుర్కొన్నాక ఫాతిమతో విజయ్ ప్రేమకథలో ట్విస్ట్ మొదలవుతుంది.
అయితే ఇది వినడానికి చాలా సింపుల్ లైన్ లా ఉన్నా కానీ, గుస్తాక్ ఇష్క్ అనే టైటిల్ కి తగ్గట్టే కథ ఆద్యంతం కళాత్మక ధృక్పథం, మ్యూజికల్ బ్రిలియన్సీతో రన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ఫాతిమతో విజయ్ వర్మ లవ్ మేకింగ్ సీన్లు, ఉర్ధూ కవి నసీరుద్ధీన్ షాతో ఫేసాఫ్ సీన్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
ఈ చిత్రంతో బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి విభు పూరి దర్శకత్వం వహించారు. రెండు నిమిషాల ముప్పై సెకన్ల ట్రైలర్ విజయ్ వర్మ ఉర్దూ కవిత్వం నేర్చుకోవడానికి నసీరుద్దీన్ షా ఇంటికి వెళ్లడంతో ప్రారంభమవుతుంది. కవితలు నేర్చుకోవడం మాటేమో కానీ, నసీరుద్ధీన్ షా కుమార్తె ఫాతిమా సనా షేక్‌తో విజయ్ ప్రేమలో పడతాడు. ఈ జంట అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మనీష్ మల్హోత్రా సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ట్రైలర్‌ను షేర్ చేయగా ఇది వైరల్ గా మారుతోంది.
ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ సంగీతం, గుల్జార్ సాహిత్యం, రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్, మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రంలో నటుడు షరీబ్ హష్మీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. కవితలు నేర్చుకోవడానికి వచ్చి ప్రేమలో పడే కుర్రాడి వ్యవహారం ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి.
గుస్తాఖ్ ఇష్క్ చిత్రం మనీష్ మల్హోత్రా కెరీర్ లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. నిర్మాతగా ఆరంగేట్రమే అభిరుచి ఉన్న సినిమాని నిర్మిస్తున్నారని ట్రైలర్ చెబుతోంది. ఇలాంటి పీరియాడికల్ కథత ప్రయోగం చేయడంలో విభు పూరి పనితనాన్ని ప్రశంసించాలి. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
