గుర్రం పాపిరెడ్డి.. 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
టైటిల్ తోపాటు ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తి నెలకొల్పిన గుర్రం పాపిరెడ్డి మూవీ.. డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో రిలీజైంది.
By: M Prashanth | 22 Dec 2025 3:27 PM ISTటాలీవుడ్ నటీనటులు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. డా. సంధ్య గోలి సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) గ్రాండ్ గా మూవీని నిర్మించారు.
సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్టై రాజేంద్రన్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు. శవాలను మార్పిడి చేసి వేల కోట్లు కొల్లగొట్టే ఒక విచిత్రమైన క్రైమ్ ప్లాన్ చుట్టూ తిరిగే కథతో రూపొందింది గుర్రం పాపిరెడ్డి.
టైటిల్ తోపాటు ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తి నెలకొల్పిన గుర్రం పాపిరెడ్డి మూవీ.. డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో రిలీజైంది. అయితే సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. మూవీ చూడొచ్చని, పర్లేదని అనేక మంది సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. స్టోరీ కాన్సెప్ట్ వినూత్నంగా ఉందని చెబుతున్నారు.
అయితే గుర్రం పాపిరెడ్డి చిత్రం మూడు రోజుల్లో రూ.2.25 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. మొదటి రోజు కన్నా రెండో రోజు.. రెండో రోజు కన్నా మూడో రోజు ఎక్కువ వసూళ్లు సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి పోస్ట్ పెట్టారు.
"గుర్రం పాపిరెడ్డి కేవలం 3 రోజుల్లోనే రూ.2.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సిల్వర్ స్క్రీన్ పై ఒక నిజమైన బ్లాక్ బస్టర్ నవ్వుల విందు. థియేటర్లలో సంబరాలు కొనసాగుతున్నాయి" అంటూ గుర్రం పాపిరెడ్డి మేకర్స్ క్యాప్షన్ గా రాసుకొచ్చారు. అయితే మేకర్స్ చెప్పిన బట్టి.. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య). అయితే అతడు ఓ బ్యాంక్ లో చోరీకి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. ఆ సమయంలో డబ్బు కోసం మరో దారి ఎంచుకుంటాడు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో నర్సుగా ఉండే సౌదామిని (ఫరియా)తో ప్లాన్ వేస్తాడు.
శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని బయటకు తీసుకొచ్చి, దాన్ని వేరే సమాధిలో పెట్టాలనుకుంటాడు. అందుకు కోసం కొందరిని రంగంలోకి దించుతాడు. కానీ అప్పుడే అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలా వాటిని ఎలా ఎదుర్కొన్నారు? హీరో ప్లాన్ ఏమైంది? చివరకు ఏం జరిగింది? అన్నది పూర్తి మూవీ. మరి మీరు గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని చూశారా?
