గుర్రం పాపిరెడ్డి ట్రైలర్.. నవ్వులే నవ్వులు..
ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, క్యారెక్టర్ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
By: M Prashanth | 13 Dec 2025 8:32 PM ISTటాలీవుడ్ నటీనటులు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. డా. సంధ్య గోలి సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు తెరపై ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో రూపొందుతున్న గుర్రం పాపిరెడ్డి.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, క్యారెక్టర్ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
అయితే ట్రైలర్ ప్రకారం.. జడ్జి జి.వైద్యనాథన్ (బ్రహ్మానందం) తెలివితక్కువ వాళ్లతో చక్కగా వ్యవహరించడంలో మంచి ఎక్స్పీరియన్స్ గలవారు. అలాంటి సమయంలో ఆయన దగ్గరకు ఓ కేసు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌధామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోస్గి) వస్తారు.
వారంతా కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అయితే వారికి మరికొందరు గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకి దిగుతారు. ఆ సమయంలో ఆ దొంగలతో ఫ్రెండ్స్ బ్యాచ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిదనే విషయంపై గ్యాంగ్స్ వేట సాగిస్తాయి.
ఆ రెండు గ్యాంగులతోపాటు మరికొన్ని గ్యాంగులు కూడా తోడవుతాయి. అప్పుడే కథ మలుపు తిరుగుతుంది. ఉండ్రాజు (యోగిబాబు) ఎలా మలుపు తిప్పాడు? 1927 నుంచి 1987 వరకు జీవించిన కలింగ పోతురాజు ఎవరు? శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకున్న లింకు ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ అందరినీ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ట్రైలర్ ను పర్ఫెక్ట్ గా కట్ చేశారని చెప్పాలి. వినూత్నమైన కాన్సెప్ట్ తో ట్రైలర్ కొత్తగా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఫుల్ కామెడీ అని చెబుతున్నారు. లీడ్ రోల్స్ తోపాటు బ్రహ్మానందం, యోగి బాబు, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, ప్రభాస్ శ్రీను వంటి పలువురు ఆర్టిస్టులు తమ నటనతో ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓవరాల్ గా సినిమాపై ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
