ఇప్పటి జనరేషన్ కి ఆ చిత్రం గుండమ్మ కథలాంటిది!
తెలుగు సినిమా చరిత్రలో 'గుండమ్మ కథ' అంతటి ఖ్యాతికెక్కింది. తాజాగా ఇలాంటి గొప్ప క్లాసిక్ చిత్రంతోనే 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజ పోల్చడం విశేషం.
By: Srikanth Kontham | 2 Jan 2026 12:39 PM ISTతరాలు మారినా తరగని వినోదాలు పంచే సినిమాలు కొన్ని ఉంటాయి. మహానటులు ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన మల్టీస్టారర్ 'గుండమ్మ కథ' అలాంటి చిత్రాల్లో ఒకటి. నాటి క్లాసిక్ చిత్రాల్లో 'గుండమ్మ కథ'కు ప్రత్యేక స్థానం ఉంది. ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఇంకా మాట్లాడు కుంటున్నారంటే? ఆ సినిమా గొప్పతనం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన పనిలేదు. ఇప్పటికీ అలాంటి 'గుడండమ్మ' లు చాలా లోగిళ్లలో అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఇప్పటి జనరేషన్ యువతికి వారి తల్లిదండ్రులు పాత రోజుల్ని చెప్పే క్రమంలో గుండమ్మ కథ గురించి చెబుతుంటారు.
తెలుగు సినిమా చరిత్రలో 'గుండమ్మ కథ' అంతటి ఖ్యాతికెక్కింది. తాజాగా ఇలాంటి గొప్ప క్లాసిక్ చిత్రంతోనే 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజ పోల్చడం విశేషం. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' నిన్నటి రోజున రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవికిషోర్..ఆ సినిమాకు మాటలు అందించిన త్రివిక్రమ్ ముచ్చట్లలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రిలీజ్ కు ముందు ఈ చిత్రాన్ని రామానాయుడు ఫ్యామిలీ కోసం అదే స్టూడియోలో ప్రివ్యూ వేసారు.
ఆ సమయంలో నిర్మాతతో పాటు, త్రివిక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. ఆ డిస్కషన్ ఆయన మాటల్లోనే..''సినిమా చూసిన అనంతరం వెంకటేశ్ శ్రీమతి ఒక మాట చెప్పారు. 'ఇప్పుడు మనమందరం కూడా ఎప్పుడు మనసు బాగో లేకపోయినా ఎలా 'గుండమ్మ కథ'ను చూస్తున్నామో, తర్వాత జనరేషన్ వాళ్లు కూడా గుండమ్మ కథలా 'నువ్వు నాకు నచ్చావ్ 'సినిమా చూస్తారని' అన్ని అన్నారు. రీ-రిలీజ్ సందర్భంగా ఆ మాట త్రివిక్రమ్ గుర్తు చేసుకుని అప్పటి సందర్భంలోకి వెళ్లారు. ఆవిడ చెప్పింది అక్షర నిజమని అని మరోసారి తనకు అనిపిస్తుందని గురూజీ అన్నారు.
వెంకటేష్ సతీమణి నీరజ పెద్దగా సినిమా ఈవెంట్లలలో కనిపించరు. సినిమా కుటుంబం గల ఇంటికి కోడలిగా వెళ్లినా? ఆమె సినిమా ఫంక్షన్స్ లో..మీడియాలో అస్సలు కనిపించారు. చాలా ప్రయివేట్ గా ఉంటారు. భర్త వెంకటే ష్ సినిమా ఈవెంట్లకు కూడా హాజరవ్వరు. ఇల్లు..కుటుంబం తప్ప మరో ధ్యాష లేకుండా ఉంటారు. అలాంటి నీరజ నోట ఆనాడే 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం గురించి అంత గొప్పగా జడ్చ్ చేసారంటే? చిన్న విషయం కాదు. మాటల మాంత్రికుడినే తన జడ్జ్ మెంట్ తో ఫిదా చేసారు. మరి సతీమణి జడ్జిమెంట్ పై వెంకటేష్ ఏమంటారో?ఏడు కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం 2001లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల వసూళ్లను సాధించింది.
