ధురంధర్ బ్యూటీ అప్పుడే ఆ రేంజ్ లో ఇంపాక్ట్!
ప్రస్తుతం డైరెక్టర్లు అంతా కాంబినేషన్స్ కంటే కంటెంట్ ని నమ్ముకునే సినిమాలు చేస్తున్నారు.
By: Srikanth Kontham | 19 Jan 2026 8:30 AM ISTప్రస్తుతం డైరెక్టర్లు అంతా కాంబినేషన్స్ కంటే కంటెంట్ ని నమ్ముకునే సినిమాలు చేస్తున్నారు. రాసిన కంటెంట్ లో ఏ పాత్రకు ఏ నటి పర్పెక్ట్ గా సూటవుతుందో స్క్రీనింగ్ చేసి ఎంపిక చేస్తున్నారు. ఆ తర్వాత కంటెంట్ లో వారి బలమెంత? అన్నది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నటీనటులపైనే ఉంటుంది. దర్శకుడు కొంత వరకే గైడ్ చేయగలరు. ఆపై రాణించాల్సింది వారి ప్రతిభతోనే. ఇలాంటి నటీనటులు దొరకడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అందులోనూ హీరయిన్లతో సన్నివేశాలు పండించడం అంటే ఆషామాషీ కాదు. భాష తెలియదు.
సరైన యాక్టింగ్ స్కిల్స్ ఉండవు. కేవలం పాత్రకు సూట్ అవుతారు? అనే కారణంతో ఎంపిక చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు అవ్వదు. తాజాగా `యూఫోరియా` సినిమాకు దర్శక, నిర్మాత గుణశేఖర్ బాలీవుడ్ నటి సారా అర్జున్ ని అదే కోణంలో తీసుకున్నట్లు ఆయన మాటల్లో బయట పడుతుంది. గుణశేఖర్ చాలా కాలానికి ఓ యూత్ పుల్ ఎంటర్ టైనర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. భూమిక , సారా అర్జున్, విగ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. అయితే ఈ సినిమాలో సారా అర్జున్ ప్రత్యేకత గురించి చెప్పి గుణశేఖర్ షాక్ ఇచ్చారు.
ఈ సినిమాలో సారా అర్జున్ నటించదంటే? ప్రాజెక్ట్ ఆపేయాలని భార్య నీలిమతో అన్నారుట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. దీంతో సారా అర్జున్ పాత్రకు సినిమాలో ఎంత వెయిట్ ఉంది? అన్నది అద్దం పడుతుంది. ఇప్పటి వరకూ సినిమాలో సారా పాత్ర ఓ చిన్న రోల్ అయి ఉంటుందనుకున్నారంతా. కానీ గుణ మాటల్లో ఆమె పాత్ర ఎంతో బలమైందని తెలుస్తోంది. సాధారణంగా కొత్త హీరోయిన్లు పరిచయమవుతున్నారంటే? డైరెక్టర్లు ఎవరూ వాళ్లపై పెద్దగా ఆధారపడరు. థియేటర కు ప్రేక్షకుల్ని తీసుకొచ్చేంత సత్తా వారికుండదు.
కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేది. కొంత కాలంగా ఇదే విధానంలో సినిమాలు తీస్తున్నారు. గుణశేఖర్ మనసును కదిలించిన కథ ఇది. ఈ సినిమా చూస్తోన్న సమయంలో కొందరు మధ్యలోనే బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. ఇంకొందరికి తనపై కొపం వచ్చి తిట్టినా తిడతారు అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా అందరూ ఆలోచిస్తారని ధీమా వ్యక్తం చేసారు.
సారా అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `ధురంధర్` విజయంతో దేశమంతా మారుమ్రోగిపోతున్న పేరు అది. తొలి సినిమా ధురంధర్ ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో? సంచలనంగా మారింది. బాలీవుడ్ హీరోయిన్లలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న హీరోయిన్లనే ఆమె పేరిట ఇదో రికార్డుగా నమోదైంది. ఆక్రేజ్ గుణశేఖర్ సినిమాకు ప్లస్ అవుతుంది.
