Begin typing your search above and press return to search.

గుణశేఖర్ యుఫోరియా.. సరికొత్త ప్రయోగంలో స్పెషల్ అట్రాక్షన్ అదే!

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న మరో అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఊర మాస సాంగ్ ఉంటుందట.

By:  Madhu Reddy   |   29 Sept 2025 1:08 AM IST
గుణశేఖర్ యుఫోరియా.. సరికొత్త ప్రయోగంలో స్పెషల్ అట్రాక్షన్ అదే!
X

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అద్భుతమైన దర్శకత్వ మెళుకువలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన యుఫోరియా అనే కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విగ్నేష్ గవిరెడ్డి హీరోగా నటిస్తున్న యుఫోరియా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ యుఫోరియా సినిమా డ్రగ్స్ ఆధారంగా రూపొందుతోందట. ఈ తరం యువతను ఎక్కువగా టార్గెట్ చేసుకొని గుణశేఖర్ ఒక అద్భుతమైన కథను రాసినట్లు సమాచారం.. ముఖ్యంగా ఇందులోని మూడు సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని.. కచ్చితంగా యూత్ ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని పలు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మొదట 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలనుకున్న ఈ సినిమాకి ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న మరో అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఊర మాస సాంగ్ ఉంటుందట. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాట యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని, మొత్తానికి ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సాంగ్ నిలవబోతోందని సమాచారం.పక్క యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం గుణశేఖర్ చాలా కొత్తగా స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తోంది. పైగా నేటి యువత తాలూకు ఎమోషన్స్ ను ఇందులో చూపించబోతున్నారని.. గుణశేఖర్ లోని కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా చూస్తారని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. అలాగే 20 మంది కొత్త వాళ్లు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. కుటుంబ సమేతంగా చూడదగిన మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు.

గుణశేఖర్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను అలరించడంలో గుణశేఖర్ ఎప్పుడు ముందు ఉంటారు. ఈయన కథలలో చారిత్రక అంశాలే కాదు ఇలా యువతను ఆధారంగా చేసుకొని కథలు కూడా రూపొందిస్తూ ఉంటారు. ఈయన కెరియర్ విషయానికి వస్తే.. 1997లో బాల రామాయణం సినిమాకి దర్శకత్వం వహించి.. జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో పలు నంది అవార్డులు కూడా అందుకున్నారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించబడింది కూడా.

అలాగే 2003లో మహేష్ బాబుతో ఒక్కడు సినిమా చేసి 8 నంది అవార్డులు, ఉత్తమ దర్శకుడుగా పురస్కారంతోపాటు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. 2015లో అనుష్క శెట్టితో రుద్రమదేవి సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.