Begin typing your search above and press return to search.

గుణ‌శేఖ‌ర్ కి ఎన్టీఆర్ బాకీ..కానీ తీర్చడం క‌ష్ట‌మే!

ఇండ‌స్ట్రీలో గుణ‌శేఖ‌ర్ సక్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిరంజీవి, మహేష్‌, ర‌వితేజ , బ‌న్నీ స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసారు.

By:  Srikanth Kontham   |   10 Oct 2025 11:00 PM IST
గుణ‌శేఖ‌ర్ కి ఎన్టీఆర్ బాకీ..కానీ తీర్చడం క‌ష్ట‌మే!
X

ఇండ‌స్ట్రీలో గుణ‌శేఖ‌ర్ సక్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిరంజీవి, మహేష్‌, ర‌వితేజ , బ‌న్నీ స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసారు. అనుష్క‌తో 'రుద్ర‌మదేవి' చిత్రాన్ని తెర‌కెక్కించి హిట్ అందుకున్నారు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. అయితే వైఫ‌ల్యాలు గుణ‌శేఖ‌ర్ ని రేసు నుంచి వెన‌క్కి నెట్టాయి. చివ‌రిగా రెండేళ్ల క్రితం స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `శాకుంతలం` తెర‌కెక్కించారు. ఈ సినిమా విజ‌యంతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతారు? అనుకుంటే సాధ్య‌ప‌డ‌లేదు. మ‌రి గుణ టీమ్ నుంచి వ‌చ్చే త‌దుప‌రి సినిమా ఏదై ఉంటుందో చూడాలి.

అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో కూడా గుణశేఖ‌ర్ అప్ప‌ట్లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో అది సాధ్య‌ప‌డ‌లేదు. క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో ప‌ట్టాలెక్కించాల్సిన చిత్రాన్ని ఆపేసారు. అప్ప‌టి నుంచి ఆ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. కానీ గుణ‌శేఖ‌ర్ తో? ఎన్టీఆర్ అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్టీఆర్ బాల న టుడిగానే గుశేఖ‌ర్ తో `రామాయ‌ణం` సినిమా చేసారు. ఇది 1997 లో రిలీజ్ అయింది. అందులో తార‌క్ రామ పాత్ర‌లో న‌టించ‌గా..సీత పాత్ర‌లో స్మితా మాధ‌వ్ న‌టించారు. అలా తొలిసారి తార‌క్-గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ క‌లిసింది.

అదే సాన్నిహిత్యంతో రుద‌మ్ర‌దేవి చిత్రంలో గోన గొన్నారెడ్డి పాత్ర‌కు మ‌హేష్ తో పాటు, ఎన్టీఆర్ కూడా ముందుకొ చ్చారు. కానీ వాళ్లతో కాకుండా ఆ పాత్ర బాధ్య‌త‌లు అల్లు అర్జున కి అప్ప‌గించారు. అలా అప్పుడు కూడా తార‌క్ తో ఛాన్స్ ను గుణ మిస్ చేసుకున్నారు. మ‌రి గుణ‌శేఖ‌ర్ ఉన్న తాజా ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ తో సినిమా సాధ్య మ‌వుతుందా? అంటే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. గ్లోబ‌ల్ ఇమేజ్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

గుణ‌శేఖ‌ర్ ఫాంలో లేరు. చేతి వ‌ర‌కూ వ‌చ్చిన ప్రాజెక్ట్ లు వెన‌క్కి పోతున్నాయి. అన్నీ స‌వ్యంగా జ‌రిగితే రానాతో `హిర‌ణ్య‌క‌శిప` చిత్రం చేయాలి గుణ‌. కానీ అది వెన‌క్కి పోయింది. ఇప్పుడా ప్రాజెక్ట్ ఎవ‌రి చేతుల్లో ఉందో కూడా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ వ‌య‌సు 61. వ‌యో భారం త‌ప్ప‌దు. మ‌రి ఇలాంటి ఫేజ్ లో ఉన్న గుణ‌శేఖ‌ర్ తో సిన‌మా అంటే? అంత సుల‌భం కాదు. అద్బుతాలు జ‌రిగితే త‌ప్ప సాధ్యం కాదు. మ‌రి అలాంటి మిరాకిల్ ఏదైనా జ‌రుగుతుందేమో చూడాలి.