గుణశేఖర్ యుఫోరియా సైలెన్స్ రీజన్ ఏంటి..?
టాలీవుడ్ లో సీనియర్ స్టార్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. తెలుగు స్టార్స్ తో పనిచేసిన అనుభవంతో పాటు సినిమా మీద ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో ఆయన తీసిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది.
By: Ramesh Boddu | 1 Dec 2025 2:00 PM ISTటాలీవుడ్ లో సీనియర్ స్టార్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. తెలుగు స్టార్స్ తో పనిచేసిన అనుభవంతో పాటు సినిమా మీద ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో ఆయన తీసిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ తో బాల రామాయణం తీసిన గుణశేఖర్ మహేష్ తో ఒక్కడు లాంటి సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన తీసిన సొగసు చూడతరమా సినిమాకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఒక్కడు తర్వాత స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిన ఆయన ఆ తర్వాత సినిమాల్లో ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.
అనుష్కతో గుణశేఖర్ రుద్రమదేవి..
అనుష్కతో రుద్రమదేవి సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నారు గుణశేఖర్. అప్పటికే అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది కాబట్టి రుద్రమదేవి మీద భారీ అంచనాలు ఉన్నా సినిమా మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. ఐతే ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే దాదాపు 8 ఏళ్లు గ్యాప్ తీసుకుని శాకుంతలం సినిమా తీశారు గుణశేఖర్. సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.
ఐతే ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. ఐతే ఆమధ్య గుణశేఖర్ యుఫోరియా అంటూ ఒక సినిమా ప్రకటించారు. యంగ్ టీం తో గుణశేఖర్ ఒక డిఫరెంట్ కథతో రాబోతున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున యుఫోరియా సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, నాజర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఐతే ఈసారి థ్రిల్లర్ కథతో వస్తున్నారు గుణశేఖర్.
థ్రిల్లర్ కథాంశంతో యుఫోరియా..
ప్రస్తుతం ఆడియన్స్ అంతా కొత్తదనం కోరుతున్నారు కాబట్టి గుణశేఖర్ కూడా యుఫోరియాతో ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రగ్స్ ఇష్యూపై థ్రిల్లర్ కథాంశంతో యుఫోరియా వస్తుందని తెలుస్తుంది. ఐతే అప్పట్లో యుఫోరియా టీజర్ తో వచ్చిన గుణశేఖర్ అండ్ టీం మళ్లీ సైలెంట్ అయ్యారు. సినిమా సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ టైం లో ప్రమోషన్స్ చేసే ప్లానింగ్ ఉందని టాక్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 25 క్రిస్ మస్ రేసులో యుఫోరియాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. సో ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది కాబట్టి యుఫోరియా టీం ప్రమోషన్స్ మొదలు పెడితే బెటర్ అని చెప్పొచ్చు. గుణశేఖర్ ఈ యుఫోరియాతో తన కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఈ యుఫోరియా నిజంగానే ఆడియన్స్ ని ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తుందో చూడాలి. డిసెంబర్ లో క్రిస్ మస్ కి ఈసారి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి వాటిలో ఏది ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటుందో చూడాలి.
