Begin typing your search above and press return to search.

తెలుగు MLA బయోపిక్.. కన్నడ స్టార్ చేయడానికి కారణమేంటి?

అయితే పరమేశ్వర్ హిర్వాలే.. పలువురు నటులను సంప్రదించారని.. కానీ ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

By:  M Prashanth   |   23 Oct 2025 6:00 PM IST
తెలుగు MLA బయోపిక్.. కన్నడ స్టార్ చేయడానికి కారణమేంటి?
X

సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ఎప్పటికప్పుడు తెరకెక్కుతూనే ఉంటాయి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఓ తెలుగు ఎమ్మెల్యే బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ శాసనసభ ప్రతినిధి గుమ్మడి నర్సయ్య జీవితం మూవీగా వస్తోంది.





గుమ్మడి నర్సయ్య టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాకు పరమేశ్వర్ హిర్వాలే దర్శకత్వం వహిస్తున్నారు. 2022లోనే అనౌన్స్ చేసినా.. మూడేళ్ల పాటు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు సేకరించి, పరిశోధన చేశారని తెలుస్తోంది. ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని వినికిడి. దీంతో మూవీ గురించి నెట్టింట చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా సినిమా క్యాస్టింగ్ కోసమే. ఎందుకంటే తెలుగు మాజీ ఎమ్మెల్యే బయోపిక్ గా వస్తున్న ఆ సినిమాలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అసెంబ్లీ ముందు సైకిల్ పై అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేగా ఉన్న శివన్న లుక్ విడుదలైంది.

దీంతో ఫస్ట్ లుక్ అదిరిపోయిందని.. శివరాజ్ కుమార్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని అనేక మంది నెటిజన్లు, కామెంట్లు పెడుతున్నారు. తన నటనతో మెప్పించేలా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం.. టాలీవుడ్ లో ఇంత మంది ప్రముఖ నటులు ఉన్నప్పటికీ.. ఆయనను ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు.

అయితే పరమేశ్వర్ హిర్వాలే.. పలువురు నటులను సంప్రదించారని.. కానీ ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. వాటిలో నిజమెంతో తెలియకపోయినా.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివరాజ్ కుమార్ కు గుమ్మడి నర్సయ్య జీవిత కథ చెప్పగానే.. వెంటనే ఓకే చెప్పారని వినికిడి.

ఇక గుమ్మడి నర్సయ్య విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సొంతం చేసుకున్న ఆయన.. అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్లి వార్తల్లో నిలిచారు. సీపీఐ పార్టీ తరఫున భద్రాచలంలోని ఇల్లందు ప్రాంతానికి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కడా ఏ సమయంలోనూ ఆర్భాటాలు ప్రదర్శించలేదు.

కనీసం సొంతంగా ఒక స్కూటర్ కూడా ఆయన వద్ద లేదు. సాధారణ మనిషిలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. సహాయం అడిగిన వారికి చేస్తారు. గన్ మ్యాన్ ను కూడా పెట్టుకోరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీప్ ను వాడిన ఆయన.. ఆ తర్వాత నుంచి సాధారణ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటారు.

ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఇంటి స్థలాన్ని పార్టీకి ఇచ్చేశారు. పెన్షన్ బెనిఫిట్స్ కూడా అందించారు. పెన్షన్ బెనిఫిట్స్ పార్టీకే ఇచ్చారు. పార్టీ హోల్ టైమర్ గా ఇచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు. 70 ఏళ్లు దాటినప్పటికీ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై తీస్తున్న బయోపిక్ త్వరలో రానుంది.