ఓటీటీలోకి ఒళ్ళు గగుర్పొడిచే మూవీ!
ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధిస్తున్నాయి.. కొంతమంది హార్రర్ సినిమాలను ఇష్టపడరు.
By: Madhu Reddy | 22 Oct 2025 6:31 PM ISTఈ మధ్యకాలంలో చాలా సినిమాలు హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధిస్తున్నాయి.. కొంతమంది హార్రర్ సినిమాలను ఇష్టపడరు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం హార్రర్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడి చూస్తూ ఉంటారు. అలా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన గుజరాతి హార్రర్ మూవీ వాష్ లెవెల్ -2 ఓటిటి లోకి వచ్చేసింది.. థియేటర్లో చూసిన ప్రేక్షకులను భయపెట్టించిన ఈ గుజరాతి ఫిల్మ్ తాజాగా ఓటీటీలోకి రావడంతో చాలామంది హార్రర్ ప్రియులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వాష్ లెవెల్ -2 మూవీకి సంబంధించిన టీజర్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అయినటువంటి నెట్ఫ్లిక్స్ అధికారికంగా రిలీజ్ చేసింది.. "డర్ కా మహౌల్ హై ఇస్ బార్ బచ్నా హోగా ముష్కిల్ అక్టోబర్ 22న నెట్ ఫ్లిక్స్ లోకి వాష్ లెవెల్ 2 వస్తుంది చూడండి" అని పేర్కొన్నారు.. ఓటీటీలో ఈ హార్రర్ ఫిల్మ్ గుజరాతి తో పాటు హిందీ భాషలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
2023లో బ్లాక్ బస్టర్ అయినటువంటి వాష్ మూవీకి సీక్వెల్ గా వాష్ లెవెల్ 2 ని తీసుకువచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో వాష్ లెవెల్ -2 మూవీ విడుదలైంది. అలా విడుదలైన ఈ మూవీ అక్టోబర్ 22న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. కృష్ణదేవ్ యగ్నిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హితు కనోడియా, జానకి బోడివాలా, మోనాల్ గజ్జర్, హితేన్ కుమార్, చేతన్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రత్యేక శక్తులు కలిగినటువంటి అధర్వ తన కూతురు ఆర్యాని ఒక డార్క్ ఫోర్స్ నుంచి కాపాడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఆ శక్తి అందులోనే ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత విలన్ ప్రతాప్ తిరిగి రావడంతో ఆర్య అలాగే బ్లాక్ మ్యాజిక్ చేయబడిన పాఠశాల విద్యార్థుల బృందాన్ని రక్షించడానికి అథర్వ మరొకసారి చెడుకు ఎదురుగా వెళ్తారు. ఇక అధర్వ అతీంద్రీయ ముప్పును ఎదుర్కొన్నప్పుడు అతను ఒకప్పుడు ఎదుర్కొన్న చెడు నిజంగా ఎప్పుడు ఓడి పోలేదని గ్రహిస్తాడు.. ఈ మూవీ క్లైమాక్స్ లో అథర్వ గత భయానక సంఘటనలతో ముడిపడి ఉన్న కొత్త గందరగోళంతో పోరాడుతున్నట్లు చూపించారు. ఈ మూవీ థియేటర్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలా ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన రావడంతో ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు..
2023 లో వచ్చిన వాష్ మూవీకి 71 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ గుజరాతి ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.. అంతే కాదు ఈ సినిమాలో నటించిన జానకి బోడివాల తన నటనకు ఉత్తమ సహాయ నటి గా అవార్డును అందుకుంది. అలా బ్లాక్ మ్యాజిక్,భయానక దృశ్యాలు వంటి అంశాలతో కలిగి ఉన్న ఈ సినిమాని థియేటర్లలో మిస్సయిన ప్రతి ఒక్కరు నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో ఈరోజు నుండి చూసేయవచ్చు.
