వివాహేతర సంబంధాలపై కథలు ఈరోజుల్లోనా?
పార్ట్ 4లో ఒరిజినల్ లో నటించిన తారలు తిరిగి నటిస్తున్నారు. అఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్‌ముఖ్ తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు.
By: Sivaji Kontham | 16 Sept 2025 3:45 AM ISTమస్తీ ఫ్రాంఛైజీలో మొదటి మూడు భాగాలు నిర్మాతలకు నష్టం మిగల్చలేదు. మస్తీ, గ్రాండ్ మస్తీ విజయాల్ని అందుకున్నాయి. మూడో భాగం యావరేజ్ గా ఆడింది. అయితే ఇప్పుడు మిలాప్ జవేరి దర్శకత్వంలో `గ్రాండ్ మస్తీ 4` చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఫ్రాంఛైజీ చిత్రాలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో హాస్యం చుట్టూ కథ తిరుగుతుంది. జంటల మధ్య గందరగోళం రివర్స్ ట్రీట్ గా మారుతుంది. నేటి సమాజంలో భార్యభర్తల నడుమ సున్నిత వ్యవహారాలను హ్యూమరస్ గా తెరపై చూపించే ప్రయత్నమిదని చెబుతున్నారు.
పార్ట్ 4లో ఒరిజినల్ లో నటించిన తారలు తిరిగి నటిస్తున్నారు. అఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్‌ముఖ్ తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు. అర్షద్ వార్సీ, నర్గీస్ ఫఖ్రీ , తుషార్ కపూర్ కూడా టీమ్ లో చేరారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. నవంబర్ రిలీజ్ లక్ష్యంగా దీనిని సిద్ధం చేస్తున్నారు.
అయితే భార్య భర్తల నడుమ ఎఫైర్ కథల్ని ఈ రోజుల్లో చూపించినా అవి రొటీన్ గానే కనిపిస్తాయి. ఇలాంటి రొటీన్ కథలకు ఆదరణ దక్కుతుందా లేదా చెప్పలేమని నెటిజనులు విశ్లేషిస్తున్నారు. అడల్ట్ కామెడీ చాలా పురాతనమైనది. థియేటర్లలో ఇలాంటి సినిమాలు జనం చూడలేరు. ఇటీవలి కాలంలో ఓటీటీ యూట్యూబ్ లో ఈ తరహా అడల్ట్ కామెడీలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. దీనికోసం థియేటర్లకు రావాలనుకునే జనం ఇప్పుడు లేరని కూడా విశ్లేషిస్తున్నారు. ఇది పెద్ద తెరపై వర్కవుట్ అయ్యే ఫార్ములా కానే కాదని, ఓటీటీ తెరకు మాత్రమే సూటబుల్ అని విశ్లేషిస్తున్నారు.
