కింగ్డమ్ స్టోరీ రామ్ చరణ్ కు చెప్పారా.. దర్శకుడి రిప్లై ఇదే
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం కింగ్డమ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
By: M Prashanth | 3 Aug 2025 1:20 PM ISTడైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం కింగ్డమ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో గౌతమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఆయన గతంలో రామ్ చరణ్ కు చెప్పారని.. అది కింగ్డమ్ స్టోరీనే అని ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
నేను, చరణ్ కు కలిసినప్పుడు నా స్టోరీ ఐడియా ఆయనకు చెప్పాను. దానిపై మేమిద్దరం చాలా ఎగ్జైటింగ్ అయ్యాం. కానీ కొద్ది రోజుల తర్వాత అదే ఐడియాను కథలాగా మలిచి చెప్పినప్పుడు అంత ఎగ్జైటింగ్ గా లేదు. అంటే ఒక్కొక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. ఈ స్టోరీ చరణ్ ఆశించినట్లుగా రాలేదు. అయితే సార్ అనుకున్న విధంగా నా స్టోరీ రాయలేదేమో అని నాకు అనిపించింది.
అయితే అలాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ తరచూ రాదు. అందుకని నేను ఇందులో మార్పులు, చేర్పులు ఏవేవో చేసేసి ఏదో ఒక సినిమాగా తీయడం నాకు ఇష్టం లేదు. ఆయన కథ విన్నాక మనస్ఫుర్తిగా నచ్చాలి. ఆయన ఇష్టంగా చేస్తాను అని అనాలి. అందుకే మళ్లీ ఓ సాలిడ్ స్టోరీ, కంప్లీట్ గా రాసుకొని వస్తానని ఆయనకు చెప్పాను.
కానీ, ఆ స్క్రిప్ట్ నాకు ఇప్పటికీ ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఆ కథకు సరిపోయే వేరే హీరోతో ఈ సినిమా చేస్తాను. అని చరణ్ తో ప్రాజెక్ట్ పై క్లారీటి ఇచ్చారు. అలాగే ఆయనకు వినిపించింది కింగ్డమ్ స్టోరా కాదని కూడా స్పష్టతనిచ్చారు. దీంతో ఆయన చరణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పట్లో ఆయనతో సినిమా ప్లాన్స్ పట్టాలెక్కేదని అర్థమవుతోంది.
