గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ లో హీరో ఎవరబ్బా?
గౌతమ్ తిన్ననూరి స్పీడ్కి మరోసారి బ్రేక్ పడింది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ నమోదు చేస్తాడనుకుంటే? అది సాధ్యపడలేదు.
By: Srikanth Kontham | 10 Aug 2025 4:00 AM ISTగౌతమ్ తిన్ననూరి స్పీడ్కి మరోసారి బ్రేక్ పడింది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ నమోదు చేస్తాడనుకుంటే? అది సాధ్యపడలేదు. ఇటీవలే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `కింగ్డమ్` ఆశించిన ఫలితాలు సాధించ లేదు. సినిమా కు డివైడ్ టాక్ రావడంతో? బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. `మళ్లీ రావా`, `జెర్సీ` లాంటి క్లాసిక్ హిట్స్ తర్వాత మాస్ హిట్ కొడతాడు? అన్న అంచనాలు తారుమారయ్యాయి. అంతకు ముందు బాలీవుడ్ `జెర్సీ` తోనూ నిరాశ తప్పలేదు. ఇలా రెండు వైఫల్యాలు గౌతమ్ స్పీడ్ కు బ్రేక్ లా పడింది. దీంతో గౌతమ్ వాట్ నెక్స్ట్ అన్నది తెలియాలి.
మరో కల్ట్ లవ్ స్టోరీ:
సితార ఎటర్ టైన్ మెంట్స్ లో మ్యాజిక్ అనే సినిమా కమిట్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి వివరాలేవి ఇంకా బయటకు రాలేదు. అందులో హీరో ఎవరు? అన్నది క్లారిటీ లేదు. కానీ ఇదొక మ్యూజి కల్ లవ్ స్టరీగా తెరపైకి వస్తోంది. కింగ్ డమ్ తరహా యాక్షన్ పక్కన బెట్టి ఓ క్లాసిక్ లవ్ స్టోరీ తో ముందు కొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ కి కలిసొచ్చింది కూడా ఆ జానర్ చిత్రాలే . తొలి సినిమా `మళ్లీ రావా` ఓక్లాసిక్ చిత్రంగా నిలిచింది. అటుపై నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన `జెర్సీ` లోనూ కల్ట్ యాంగిల్ హైలైట్ అయింది.
రీమేక్ సైతం ఆలస్యంగా:
క్రికెట్ నేపథ్యంతో కూడిన కథే అయినా? లవ్ స్టోరీని అంతే రక్తి కట్టించాడు. ఈ రెండు గౌతమ్ కి కలిసొ చ్చిన అంశాలు. వాటిని వదిలి చేసిన కింగ్ డమ్ ప్రతికూలను తీసుకొచ్చింది. మరి ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని ఎలా హైలైట్ చేస్తాడు? అన్నది చూడాలి. గౌతమ్ సినిమా- సినిమాకు గ్యాప్ తీసుకుంటారు. వెంట వెంటనే సినిమాలు చేసే డైరెక్టర్ కాదు. `మళ్లీరావా` లాంటి హిట్ ఇచ్చినా? మరో సినిమా `జెర్సీ` చేయడానికి రెండేళ్లు పట్టింది. అదే సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మరో రెండేళ్లు సమయం తీసుకున్నారు.
కొత్త సినిమా ఎప్పుడు?
ఆ తర్వాత కింగ్ డమ్ మొదలు పెట్టి పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మూడేళ్లు పట్టింది. అదే ప్రణాళిక అయితే గౌతమ్ మ్యూజికల్ లవ్ స్టోరీ పై వచ్చే ఏడాది వరకూ గానీ క్లారిటీ రాదేమో. ఒకవేళ అనౌన్స్ మెంట్ వచ్చినా? అది పట్టాలెక్కించి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అసలే ప్రతికూల ఫలితాలు చూస్తోన్న గౌతమ్ తదుపరి ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మరి కొత్త చిత్రాన్ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారు? అన్నది అధికారికంగా బయటకు వస్తే గానీ క్లారిటీ ఉండదు.
