Begin typing your search above and press return to search.

స్టార్ హీరో విడాకుల‌పై ఫ్యామిలీ లాయ‌ర్ కామెంట్

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా- సునీత అహూజా దంప‌తుల మ‌ధ్య క‌ల‌త‌ల‌పై హోట‌ర్ ఫ్లై రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   23 Aug 2025 1:54 PM IST
స్టార్ హీరో విడాకుల‌పై ఫ్యామిలీ లాయ‌ర్ కామెంట్
X

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా- సునీత అహూజా దంప‌తుల మ‌ధ్య క‌ల‌త‌ల‌పై హోట‌ర్ ఫ్లై రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. వ్య‌భిచారం, క్రూర‌త్వం, కాపురం వ‌దిలిపెట్ట‌డం వంటి ఆరోప‌ణ‌ల‌ను గోవిందా ఎదుర్కొంటున్న‌ట్టు ఈ క‌థ‌నం పేర్కొంది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పంచాయితీకి అత‌డి భార్య‌ సునీత రెగ్యుల‌ర్ గా అటెండ‌వుతున్నా గోవిందా స్కిప్ కొడుతున్నాడ‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొన్న‌ట్టు `లైవ్ మింట్` త‌న క‌థ‌నంలో ధృవీక‌రించింది. స్టార్ హీరో విడాకుల వ్య‌వ‌హారంపై చాలా జాతీయ మీడియాలు వ‌రుస క‌థ‌నాలు వేయ‌డంతో అది కాస్తా సంచ‌ల‌నంగా మారింది.

పాత‌వే కొత్త‌గా తెర‌పైకి...

తాజాగా త‌న క్లైయింట్ గోవిందాపై వ‌స్తున్న మీడియా క‌థ‌నాల‌ను న్యాయ‌వాది ల‌లిత్ బింద్రా కొట్టి పారేసారు. ఆయ‌న ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ``పాత విష‌యాలు.. తిరిగి కొత్త‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి! కేసు లేదు.. ఏమీ లేదు.. ప్రతిదీ పరిష్కార‌మ‌వుతుంది.. ఈ గణేష్ చతుర్థికి మీరంతా వారిని కలిసి చూస్తారు.. మీరు ఇంటికి రావాలి!`` అని కూడా లాయ‌ర్ వ్యాఖ్యానించారు.

ఫ్యామిలీ కోర్టులో పంచాయితీ:

హౌటర్‌ఫ్లై క‌థ‌నం ప్రకారం.. డిసెంబర్ 2024లో సునీత‌ దాఖలు చేసిన పిటిషన్‌లో గోవింద పదేపదే విచారణలకు దూరంగా ఉన్నారని, కోర్టు ఆదేశించిన కౌన్సెలింగ్ సెషన్‌లకు హాజరు కాలేదని పేర్కొంది. ప్ర‌తిసారి సునీత మాత్ర‌మే కోర్టుకు అటెండ‌వుతున్నార‌ని ఈ క‌థ‌నం వెల్ల‌డించింది. గోవిందా- సునీత దంప‌తుల‌పై విడాకుల పుకార్లు రావ‌డం ఇదే మొద‌టి సారి కాదు. ఆ ఇద్ద‌రూ విడివిడిగా రెండు ఇళ్ల‌లో నివ‌శిస్తున్నార‌ని స‌న్నిహిత బంధువులు కూడా ధృవీక‌రించారు. కానీ వారు విడిగా ఉన్నా క‌లిసే ఉన్నార‌ని కూడా క‌న్ఫ్యూజ్ చేయ‌డం చ‌ర్చ‌గా మారింది.

తిరిగి క‌లిసిపోతారు:

గోవిందా 30 ఏళ్ల మరాఠీ నటితో ఎఫైర్ సాగిస్తున్నాడ‌న్న పుకార్లు అద‌నంగా అగ్నికి ఆజ్యం పోసాయి. మ‌రాఠీ న‌టి కార‌ణంగానే భార్య‌ సునీత అత‌డికి దూరంగా ఉంటోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ జంట ఆరు నెలల క్రితం విడాకుల కోసం దాఖలు చేసినప్పటికీ దంప‌తులు తిరిగి కలిసిపోతున్నారని లాయ‌ర్ ఇంత‌కుముందు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. గోవిందా ద‌గ్గ‌ర బంధువుల్లో ప్ర‌హ్లాజ్ నిహ‌లాని, ల‌లిత్ వంటి ప్ర‌ముఖులు కూడా వారు విడిపోవ‌డం లేద‌ని మీడియా ఎదుట‌ వ్యాఖ్యానించారు.

గాల్లో ముద్దులు ఎవ‌రి కోసం?

ఓవైపు మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతుండ‌గా, వీట‌న్నిటి న‌డుమ గోవిందా ఇంత‌కుముందు మీడియా ఎదుట క‌నిపించి ఫ్లైయింగ్ కిస్ లు విసిరాడు. అత‌డి కుమారుడు య‌శ్వ‌ర్థ‌న్ అహూజా త‌మ ఇంట్లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, అంత స‌వ్యంగా ఉంద‌నే అర్థంలో ఒక ఫోటోని కూడా షేర్ చేసారు. తాను పంజాబ్ లో ఉద్యోగంలో బిజీగా ఉన్నాన‌ని గోవిందా కుమార్తె టీనా అహూజా వెల్ల‌డించారు. తాను కూల్ గా ఉన్నాన‌నే అర్థం వ‌చ్చేలా ఆమె మాట్లాడారు.