Begin typing your search above and press return to search.

స్టార్ హీరో విడాకులు.. క‌న్ఫ్యూజ్ చేస్తున్న‌ ఫ్యామిలీ డ్రామా!

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా అత‌డి భార్య సునీత అహూజా మ‌ధ్య విడాకుల ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   23 Aug 2025 1:44 PM IST
స్టార్ హీరో విడాకులు.. క‌న్ఫ్యూజ్ చేస్తున్న‌ ఫ్యామిలీ డ్రామా!
X

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా అత‌డి భార్య సునీత అహూజా మ‌ధ్య విడాకుల ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఏడాది కాలంగా సునీత అహూజా బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజ‌ర‌వుతున్నా కానీ, గోవిందా కోర్ట్ సెష‌న్స్ కి అటెండ‌వ్వ‌డం లేద‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. కొన్నేళ్లుగా ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నా, విడిగా ఉంటున్నారు! అంటూ కుటుంబ స‌భ్యుల ప్ర‌క‌ట‌న‌లు కూడా చాలా క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప‌లుమార్లు త‌న భ‌ర్త‌పై సునీత అహూజా త‌న అసంతృప్తిని బ‌య‌ట‌పెడుతూనే ఉన్నా, భ‌ర్త‌కు విడాకులిస్తున్నాను! అనే మాట మాత్రం మాట్లాడ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


ఇప్పుడు గోవిందా- సునీత దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు ర‌చ్చకెక్కిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. సునీత కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్ లో భ‌ర్త‌పై క్రూర‌త్వం, వ్య‌భిచారం, వేధింపులు వంటి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. సునీత తాజా ఇంట‌ర్వ్యూలో గోవిందాపై త‌న వ్య‌తిరేక‌త‌ను, అశాంతిని బ‌య‌ట‌పెట్ట‌డంతో పుకార్లు మ‌రింత ఉధృత‌మ‌య్యాయి. కొద్దిసేప‌టి క్రితం గోవిందా- సునీత మ‌ధ్య క‌ల‌త‌లు కొన‌సాగుతున్నాయ‌ని, ప‌రిస్థితి ఏమంత బాలేద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇంత‌లోనే గోవిందా కుటుంబీకుల నుంచి కొన్ని ప్ర‌క‌ట‌నలు అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయి.

తాజాగా గోవింద - సునీత అహుజా కుమారుడు యశ్వర్ధన్ అహుజా ఇటీవల తన ఇంట్లో పూజ చేసిన ఫోటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ టైమింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. త‌ల్లిదండ్రుల విడాకుల గురించి పుకార్లు వ‌స్తున్న ఈ స‌మ‌యంలో ఆ చిన్ని హృద‌యం అలా స్పందించింది. దేవుని పూజా కార్య‌క్ర‌మాల‌కు త‌న పెంపుడు కుక్క కూడా అటెండ‌య్యింద‌ని అతడు స‌ర‌దాగా ప్ర‌స్థావించాడు. ''నా చిన్న పిల్లవాడు పూజ కోసం మాతో చేరాడు!'' అని అతడు రాశాడు. ఈ ఫోటోలో పూజారి.. ఒక‌ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు.. ఆ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి గోవింద కావచ్చు లేదా కాకపోవచ్చు..!

అయితే ఈ ఫ్యామిలీ క‌ల‌త‌ల‌ డ్రామాలో ప‌లువురి ప్ర‌క‌ట‌న‌లు షాకింగ్‌గా ఉన్నాయి. గోవిందా క‌జిన్, ప్ర‌ముఖ‌ నిర్మాత ప్ర‌హ్లాజ్ నిహ‌లానీ కూడా ఈ దంప‌తులు విడిపోవ‌డం లేద‌ని, గోవిందాకు ఎన్ని ఎఫైర్లు ఉన్నా సునీత విడాకులు ఇవ్వ‌ద‌ని వ్యాఖ్యానించాడు. గోవిందా-సునీత దంపతుల విడాకుల వార్త‌ల‌ను ఖండిస్తూ, గోవిందా మేనేజ‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వారి మ‌ధ్య ఎలాంటి క‌ల‌త‌లు లేవ‌ని అత‌డు వ్యాఖ్యానించాడు. అలాగే గోవిందా కుటుంబ స్నేహితుడు, న‌టుడు ల‌లిత్ బిందాల్ ప్ర‌క‌ట‌న కూడా క‌న్ఫ్యూజ్ చేసింది. దంప‌తులు క‌ల‌హాలు లేకుండా బాగానే ఉన్నార‌ని అత‌డు ప్ర‌క‌టించారు. గోవిందా మేన‌కోడ‌లు ఆర్తి సింగ్ స‌హా ప‌లువురి ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాను మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ లోకి నెట్టాయి. విడాకులు అవాస్త‌వం.. వారు అన్యోన్యంగా ఉన్నార‌ని ఆర్తి సింగ్ వ్యాఖ్యానించ‌డం మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ లోకి నెట్టింది. ఓవైపు ఫ్యామిలీ కోర్టు గొడ‌వ‌లు.. మ‌రోవైపు బంధుమిత్రుల అసంపూర్ణ ప్ర‌క‌ట‌ల‌తో సెల‌బ్రిటీ క‌పుల్ న‌డుమ‌ అస‌లేం జ‌రుగుతోందో అర్థం కాని ప‌రిస్థితి ఉంది.