Begin typing your search above and press return to search.

భార్య ఆరోపణల వెనుక పెద్ద కుట్ర?

సునీత కళ్లకు ఓ పొర కమ్మి ఉందని.. ఆమె ఆలోచనలను ఎవరో నియంత్రించి తమ కాపురంలో చిచ్చుపె డుతున్నారని సంచలన వాదన తెర‌పైకి తెచ్చారు.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 1:00 AM IST
భార్య ఆరోపణల వెనుక పెద్ద కుట్ర?
X

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా -భార్య సునీతా అహుజాల వివాదం రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగు తోంది. దశాబ్దాల పాటు అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో కొంతకాలంగా అలజడులు చెల రేగడం..సునీత బహిరంగంగానే గోవిందాపై ఆరోపణలు చేయడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన గోవిందా ఓ సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చారు. గోవిందా వ్యాఖ్యల ప్రకారం.. సునీత ఇలా ప్రవర్తించడం వెనుక ఓ పెద్ద కుట్ర ఉంద‌న్నారు. ఆమెను ఎవరో కావాలనే వెనుక నుండి నడిపిస్తున్నారని..మూడో వ్యక్తి ప్రభావం వల్లనే సునీత తనపై ఆరోపణలు చేస్తోందని గోవిందా పేర్కొన్నారు.

సునీత కళ్లకు ఓ పొర కమ్మి ఉందని.. ఆమె ఆలోచనలను ఎవరో నియంత్రించి తమ కాపురంలో చిచ్చుపె డుతున్నారని సంచలన వాదన తెర‌పైకి తెచ్చారు. అయితే ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న ఏమిటంటే? సునీతా అహుజాను అంతగా ప్రభావితం చేస్తున్న ఆ మిస్టరీ పర్సన్ ఎవరు? ఈ ప్రశ్నకు గోవిందా నేరుగా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఆ వ్యక్తి పేరును బహిర్గతం చేసి వారిని సమాజంలో అవమానపరచడం తన స్వభావం కాదని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంత‌ట‌వే బయటపడతాయని గోవిందా వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించారు.

`నాపై చెడు ప్రచారం రావడం కొత్తేమీ కాదు. `బ్యాడ్ రెప్యుటేషన్` అనేది ఎప్పటినుంచో నా పేరుతో ముడిపడి ఉంది` అని వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు తన అదృష్టాన్ని, సంతోషాన్ని దెబ్బతీయడానికే భార్యను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. వెనుక నుండి ఈ లీడ్ ఇస్తున్న వ్యక్తులకు త్వరలోనే బుద్ధి వస్తుందని.. వారి కుట్రలు ఫలించవని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో గోవిందాకు ఉన్న సాన్నిహిత్యమేనని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సునీత సైతం గోవిందాపై మోసం ఆరోపణలు చేస్తూ గెన్-జీ .. మహిళల మద్దతు కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే గోవిందా మాత్రం వీటి వెనుక తన కుటుంబాన్ని నాశనం చేయాల నుకుంటున్న అదృశ్య శక్తులు ఉన్నాయనే కోణాన్ని తెరపైకి తెచ్చి రచ్చను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ప్రస్తుతానికి గోవిందా ఆ వ్యక్తి పేరును రహస్యంగా ఉంచినా? ఆయన చేసిన `మూడో వ్యక్తి కుట్ర` వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఓపికగా ఉండి ఈ పరిస్థితిని ఎదుర్కొంటానని గోవిందా చెబుతుండగా మరి ఈ మిస్టరీ పర్సన్ ఎవరు అన్నది తెలియాలి.