స్టుపిడ్ క్వశ్చన్.. జర్నలిస్టుపై నటి కౌంటర్ ఎటాక్!
కానీ జర్నలిస్టు తనను సంబంధం లేని ప్రశ్న ఎలా అడుగుతారు? అని సదరు నటీమణి ఎదురు ప్రశ్నించారు. `మీ బరువు ఎంత?` అని యూట్యూబర్ ప్రశ్నించగానే అతడిని నిలదీస్తూ గౌరి కిషన్ విరుచుకుపడ్డారు.
By: Sivaji Kontham | 7 Nov 2025 10:31 AM ISTకొన్నిసార్లు జర్నలిస్టుల ప్రశ్నలు మితిమీరినప్పుడు లేదా అదుపు తప్పినప్పుడు సెలబ్రిటీలు కోపోద్రిక్తులవ్వడం లైవ్ లోనే రసాభాస అవ్వడం చూస్తున్నదే. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. తమిళ సినిమా `అదర్స్` మీడియా సమావేశంలో ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు యువనటి గౌరి కిషన్ అతడిపై కాళికలా విరుచుకుపడిన దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఈ ఎమోషనల్ ఎపిసోడ్ లో ఇటు హీరోయిన్, అటు జర్నలిస్ట్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడం వీడియోలో కనిపించింది.
ఇది `అదర్స్` సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్. కానీ జర్నలిస్టు తనను సంబంధం లేని ప్రశ్న ఎలా అడుగుతారు? అని సదరు నటీమణి ఎదురు ప్రశ్నించారు. `మీ బరువు ఎంత?` అని యూట్యూబర్ ప్రశ్నించగానే అతడిని నిలదీస్తూ గౌరి కిషన్ విరుచుకుపడ్డారు. బరువు పెరగడానికి సవాలక్ష కారణాలుంటాయి. దానికి హార్మోన్ల సమస్య కూడా కారణం కావొచ్చు. కానీ ఇలా ఎప్పుడూ నన్ను ఎవరూ ప్రశ్నించలేదు! అంటూ నటి గౌరి కిషన్ ఎమోషనల్ అయ్యారు. త్వరలో విడుదల కానున్న అదర్స్ సినిమా గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదేమని కూడా నిలదీసే ప్రయత్నం చేసారు గౌరి. మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు.. నేను అధిక బరువు ఉన్నా ఎంపిక చేసుకోవడం డైరెక్టర్ ఛాయిస్ అని కూడా సదరు నటి మీడియా ప్రశ్నలకు ప్రతిదాడి చేసారు.
