Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీలో డింపుల్? మలినేని స్ట్రాంగ్ కౌంటర్

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   29 March 2026 2:06 PM IST
బాలయ్య మూవీలో డింపుల్? మలినేని స్ట్రాంగ్ కౌంటర్
X

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలవడంతో, రెండో ప్రాజెక్ట్‌ (NBK 111) పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆ సినిమా హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా డింపుల్ హయాతిని హీరోయిన్‌ గా తీసుకుంటున్నారనే వార్తలు కొన్ని గంటలుగా వైరల్ అవుతున్నాయి. ఆ నిర్ణయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ, ఇది దర్శకుడి బ్యాడ్ సెలక్షన్ అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు, ఆమె బదులు సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

దీంతో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు దర్శకుడు గోపీచంద్ మలినేని తనదైన స్టైల్లో స్పందించారు. నెటిజన్ ఒకరు.. "ఇంత హైప్ ఉన్న సినిమాను ఎలా చెడగొట్టాలో మేకర్స్‌ ను చూసి నేర్చుకోవచ్చు" అంటూ పోస్ట్ చేయగా, దానికి కౌంటర్‌ గా ఆయన ఫన్నీ మీమ్ వీడియోను షేర్ చేశారు. అందులో మహేష్ బాబు చెప్పిన "మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను ఎవరికీ చెప్పలేదండి" అని అంటారు.

అలా క్రేజీ మీమ్ ద్వారా డింపుల్ హయతిని సెలెక్ట్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌ పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. అయితే సినిమాలో హీరోయిన్‌ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఇప్పటికే సెలెక్ట్ చేశారు. తద్వారా సినిమాపై మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి. అలాగే కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నారని సమాచారం.

ఆ భారీ ప్రాజెక్ట్‌ ను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఆ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌ లో వేసిన ప్రత్యేక సెట్‌ లో జరుగుతుందని, బాలకృష్ణ ఆ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా మూవీ రూపొందుతోందని వినికిడి.

గ్యాంగ్‌ స్టర్ బ్యాక్‌ డ్రాప్‌ లో కథ నడవనుండగా, బాలకృష్ణ ఒక పవర్‌ ఫుల్ గ్యాంగ్‌ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. మాస్ ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని తన ప్రత్యేక మాస్ ట్రీట్మెంట్‌ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ముంబై వీధుల్లో బాలయ్య చేసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు బాలకృష్ణ- మలినేని కాంబో మరోసారి బాక్సాఫీస్‌ షేక్ చేయడానికి సిద్ధమవుతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.