మైత్రి మేకర్స్ తెలివికి ఇళయరాజా షాక్..?
మైత్రి మూవీ మేకర్స్ పెద్ద ప్లానింగ్ తోనే కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు.
By: Ramesh Boddu | 20 Sept 2025 11:50 AM ISTమైత్రి మూవీ మేకర్స్ పెద్ద ప్లానింగ్ తోనే కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఈమధ్యనే తమిళ్ లో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తీశారు మైత్రి మేకర్స్. హిందీలో కూడా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఐతే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతికి రిలీజై తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. అజిత్ ఈమధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ ని మిస్ అవుతున్నారని తెలుసుకుని ఆధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేశాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఇళయరాజా కేసు..
నిజంగానే అజిత్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ ట్రీట్ ఇచ్చింది. ఐతే ఈ సినిమాకు అంతా బాగుంది అనుకుంటున్న టైం లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా నుంచి షాక్ తగిలింది. సినిమాలో తన కంపోజిషన్ లోని 3 సాంగ్స్ ని తన పర్మిషన్ లేకుండా వాడారని ఇళయరాజా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మీద కేసు వేశాడు. నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజైన ఈ సినిమా ఆయన కేసు వల్ల నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాను డిలీట్ చేసింది. ఐతే కోర్ట్ కేసు వేసిన ఇళయరాజా తనకు 5 కోట్ల రూపాయల జరిమానా కట్టాలని కోరారు.
ఐతే ఇక్కడే మైత్రి మూవీ మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో ఇళయరాజా ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మళ్లీ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అనవసరంగా 5 కోట్లు కట్టడం ఎందుకని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇళయరాజా కేవలం ఈ సినిమా గురించే కాదు ఆయన లాస్ట్ ఇయర్ వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా విషయంలో కూడా గురు సాంగ్ వాడినందుకు కోర్ట్ కేసు వేశారు.
ఇళయరాజా వెర్షన్ ఏంటంటే..
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇలా తన పాటని వాడినందుకు కోర్ట్ కేసులు వేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఐతే ఇళయరాజా వెర్షన్ ఏంటంటే సినిమాలో మీ సాంగ్స్ వాడుతున్నామని పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని.. ముందుగానే తన అప్రూవల్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు.
మొత్తానికి ఇళయరాజా వేస్తున్న ఈ కేసులు మిస్ ఫైర్ అవుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇళయరాజా సాంగ్స్ అన్ని డిలీట్ చేసి మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.
