Begin typing your search above and press return to search.

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

భారీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే సినిమా విజయాన్ని నిర్ణయించలేవని ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ఇండియా వసూళ్లు మరోసారి చర్చకు తెస్తున్నాయి. ‘రామాయణం-1’ భారీ వసూళ్లతో థియేటర్లలో కొనసాగుతుండటం, సరైన విడుదల సమయం లేకపోవడం, ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ లేకుండా జపనీస్ వెర్షన్‌లోనే రావడం గాడ్జిల్లాకు ప్రతికూలంగా మారాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లను ‘రామాయణం’ నుంచి మార్చేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపలేదని సమాచారం. ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆసక్తి రేకెత్తించకపోవడం కూడా వసూళ్లపై ప్రభావం చూపి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   20 Nov 2026 12:13 PM IST
గాడ్జిల్లాపై రామాయ‌ణం ఇంపాక్ట్ ఎంత‌?
X

నిజానికి విజువ‌ల్ గ్రాఫిక్స్ అవ‌స‌రాన్ని మించి అతిగా అనిపిస్తే.. అలాంటి సినిమాలు చూడ‌టానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉండ‌రు. ఏఐ వీడియోలు లేదా వీఎఫ్ఎక్స్ ఫెయిలైనా సినిమాల‌ ఫ‌లితం తారుమార‌వుతుంది. చాలా ఆంగ్ల చిత్రాల ప‌రాజ‌యానికి ఇది ఒక క‌ర‌ణం అనుకుంటే, రిలీజ్ విష‌యంలో రాంగ్ టైమింగ్ కూడా ఒక పెను స‌మ‌స్య‌.

దీనికి తోడు థియేట‌ర్ల‌లో ర‌న్నింగ్ లో `రామాయ‌ణం` వంటి పురాణేతిహాసం ర‌న్ అవుతుంటే.. మంచి హిట్ టాక్ తెచ్చుకుని జోరు చూపిస్తుంటే, ఆ దూకుడును ఆపేంత‌గా ఒక సాధార‌ణ గ్రాఫిక్స్ సినిమా మాయాజాలం సృష్టించ‌గ‌ల‌దా? ప్ర‌స్తుతం `గాడ్జిల్లా మైన‌స్ జీరో` ఇండియా రిలీజ్ ప‌రిస్థితి చూస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోగ‌ల‌రు. ఈ సినిమాకి ఇక్క‌డ ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు ద‌క్క‌క‌పోవ‌డంపై బోలెడంత చ‌ర్చ సాగుతోంది.

ముఖ్యంగా నితీష్ తివారీ `రామాయ‌ణం-1` రెండో వారంలోను అద్భుత వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. 15 రోజుల్లో 1600 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం రూ.2000 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో అడుగుపెట్ట‌నుంది. మ‌రోవైపు సూర్య సీన్ కూడా ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్లు సాగిస్తోంది. ఈ స‌మ‌యంలో ఈ వీకెండ్ రిలీజ్ ల‌తోను థియేట‌ర్ల‌లో కొత్త క‌ళ రానుంది. ఈరోజు (20 న‌వంబ‌ర్) నుంచి ఆకాశంలో ఒక తార‌, ఓ.ఎం, స‌త్య‌వాన్ సావిత్రి (డబ్బింగ్) వంటి చిత్రాలు థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతున్నాయి. వీట‌న్నిటికీ థియేట‌ర్ల‌ను కేటాయించిన‌ప్పుడు కేవ‌లం జ‌ప‌నీ వెర్షన్ తో వ‌చ్చిన గాడ్జిల్లా మైన‌స్ జీరోకి థియేట‌ర్లు ఇచ్చేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధంగా లేర‌నే అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ థియేట‌ర్ల‌లో రామాయ‌ణం సినిమా ఆడుతుంటే దానిని ఒక విదేశీ చిత్రం కోసం తొల‌గించేందుకు ఎగ్జిబిట‌ర్లు అంగీక‌రించ‌లేద‌ట‌.

మొత్తానికి రాంగ్ టైమింగ్ లో ప్రాంతీయ భాష‌ల అనువాదం లేకుండా వ‌చ్చిన గాడ్జిల్లా చిత్రం ఆశించిన స్థాయి వ‌సూళ్ల‌ను సాధించ‌డం లేద‌ని ట్రేడ్ చెబుతోంది. ఒక‌వేళ పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. స‌రైన ప్ర‌ణాళిక‌తో ఇండియా రిలీజ్ చేయ‌క‌పోతే ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని ప్రూవ్ చేస్తోంది ఈ జ‌ప‌నీ చిత్రం. అయితే గాడ్జిల్లా మైన‌స్ జీరో ట్రైల‌ర్ కూడా మునుప‌టి భాగాల కంటే గొప్ప ప్ర‌భావాన్ని చూపించ‌క‌పోవ‌డం కూడా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిని లేక‌పోవ‌డానికి కార‌ణం కావొచ్చు.