Begin typing your search above and press return to search.

'గోట్ లైఫ్ కోసం ఎన్నో త్యాగాలు.. కానీ అవార్డ్ ఏది?'

అదే సమయంలో మాలీవుడ్ మూవీ లవర్స్ ముఖ్యంగా అక్కడి స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

By:  M Prashanth   |   2 Aug 2025 11:41 PM IST
గోట్ లైఫ్ కోసం ఎన్నో త్యాగాలు.. కానీ అవార్డ్ ఏది?
X

కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా 2023 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడి అవార్డును బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, విక్రాంత్ మెస్సీ పంచుకున్నారు. జవాన్ మూవీకి గాను షారుక్.. 12th ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మెస్సీలు ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు.

దీంతో షారుక్ ఖాన్, విక్రాంత్ మెస్సీలకు నెట్టింట విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మాలీవుడ్ మూవీ లవర్స్ ముఖ్యంగా అక్కడి స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.

అదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన ది గోట్ లైఫ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ కోసం పృథ్వీరాజ్ బాగా కష్టపడ్డారని చెప్పాలి. తన హెల్త్ కూడా పట్టించుకోకుండా సినిమాలో నటించారు. తన యాక్టింగ్ తో అదరగొట్టారు. సినీ ప్రియులను తెగ మెప్పించారు.

కానీ అంతలా సినిమా కోసం డెడికేషన్ గా వర్క్ చేసిన పృథ్వీరాజ్ కు అవార్డు ఇవ్వకపోవడం పట్ల ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు. జ్యూరీ ఆయనపై చిన్నచూపు చూసిందని అంటున్నారు. తక్కువ అర్హత కలిగిన వారికి, సాధారణ ప్రదర్శనల ఇచ్చిన వారికి కూడా అవార్డులు ఇచ్చారని.. కానీ తమ అభిమాన నటుడికి మాత్రం పురస్కారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.

అయితే ది గోట్ లైఫ్ మూవీని 2024 అవార్డులకు పరిశీలిస్తారేమోనని కొందరు నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది ఫలితాల కోసం వేచి ఉండమని అభిమానులను చెబుతున్నారు. వివిధ అవార్డులు గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం గోట్ లైఫ్ కు సెన్సార్ 2023లో జరిగిందని అంటున్నారు.

సెన్సార్ ఎప్పుడు జరిగితే ఆ ఏడాది సినిమాగానే అవార్డుల నిర్వాహకులు పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులతో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సే నటనను ప్రశంసిస్తుండగా, మరికొందరు జ్యూరీకి ప్రాంతీయ సినిమాలపై అవగాహన లేదని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.