Begin typing your search above and press return to search.

బీచ్ లో బికినీలో గ్లామర్ డోస్ పెంచిన ప్రదీప్ పెళ్లి చూపులు బ్యూటీ!

సాధారణంగా తెలుగు అమ్మాయిలు బాడీ షో చేయడానికి ఆసక్తి చూపించరు. అందుకే తెలుగమ్మాయిలకి అవకాశాలు రావు అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి.

By:  Madhu Reddy   |   21 Sept 2025 10:12 AM IST
బీచ్ లో బికినీలో గ్లామర్ డోస్ పెంచిన ప్రదీప్ పెళ్లి చూపులు బ్యూటీ!
X

సాధారణంగా తెలుగు అమ్మాయిలు బాడీ షో చేయడానికి ఆసక్తి చూపించరు. అందుకే తెలుగమ్మాయిలకి అవకాశాలు రావు అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్స్ లో భారీ మార్పు వచ్చింది. ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఫాలోవర్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా.. తమ నటనతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు కూడా అయిపోతున్నారు. అలా గ్లామర్ షో చేస్తూ.. ఏకంగా బికినీలతో రెచ్చగొడుతున్న హీరోయిన్స్ లో జ్ఞానేశ్వరి కాండ్రేగుల కూడా ఒకరు. చిన్న వయసులోనే మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈ చిన్నది.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఒక గుర్తింపును దక్కించుకుంది.

అయితే ప్రముఖ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లిచూపులు' కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు జ్ఞానేశ్వరి.. ఇందులో ప్రదీప్ మెచ్చిన అమ్మాయిగా పేరు దక్కించుకోవడమే కాకుండా టైటిల్ ని కూడా అందుకుంది.

ఈ కార్యక్రమం తర్వాత జ్ఞానేశ్వరి ఎన్నో అవకాశాలు దక్కించుకుంది. 'మిస్టర్ అండ్ మిస్' సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఆ తర్వాత నీ జతగా, చక్ర వ్యూహం, మాయలో వంటి చిత్రాలలో కూడా చేసింది. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్లలో కూడా లీడ్ రోల్ పోషించి అందరినీ ఆకట్టుకుంది జ్ఞానేశ్వరి.

ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్న ఈమె.. తన గ్లామర్ ఫోటోలను, వీడియోలను కూడా వదులుతూ ఫాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇకపోతే సినిమాలలో గ్లామర్ వలకబోసే అవకాశం రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది.

ఈ క్రమంలోనే ఓవర్ గా బాడీ షో చేస్తూ నెట్టింట మంట పెడుతోంది. తాజాగా బీచ్ కి వెళ్లిన ఈమె అక్కడ బికినీ ధరించి తన అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా ఈ అమ్మడు టూ పీస్ బికినీ ఫోటోలు చూసి అభిమానుల నుండి భారీ స్పందన లభిస్తోంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఇలా బికినీలో కనిపించడం ఇదేం తొలిసారి కాదు. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఇప్పుడు మరొకసారి ఇలా అందాల విందు చేసేసరికి ఫాలోవర్స్ సైతం ఈమె అందాల హీట్ కి విలవిలలాడిపోతున్నారు అనడంలో సందేహం లేదు.

ఈమె వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. వైజాగ్ కి చెందిన ఈమె చిన్న వయసులోనే మోడల్ గా కెరియర్ మొదలుపెట్టింది. . ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సొంతం చేసుకొని అక్కడ్నుంచి ప్రదీప్ పెళ్లి చూపులు షో ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది జ్ఞానేశ్వరి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.