యుద్దాలు కారణంగా వాయిదా పడిన చిత్రాలు!
ఇప్పటికే పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వాల్సిన కన్నడ చిత్రం 'టాక్సిక్' ను వాయిదా వేసారు.
By: Srikanth Kontham | 5 March 2026 1:24 PM ISTసాధారణంగా సినిమా రిలీజ్ లు అన్నవి ఎప్పుడు వాయిదా పడుతుంటాయి? అంటే ఆ సినిమా షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోతే రిలీజ్ లు వాయిదా పడుతుంటాయి. అప్పుడప్పుడు ప్రకృతి విపత్తుల సమయంలోనూ రిలీజ్ లకు అవకాశం ఉండదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్దం సమయంలోనూ సినిమాలు వాయిదా పడి ఉంటాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి మధ్య ప్రాచ్య దేశాల యుద్దం కారణంగానూ సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వాల్సిన కన్నడ చిత్రం 'టాక్సిక్' ను వాయిదా వేసారు.
ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా గల్ప్ దేశాలు యుద్దంతో అట్టుడుకడంతో వాయిదా వేసారు. యుద్ధ వాతావరణం వల్ల భారతీయ సినిమాల గ్లోబల్ మార్కెట్ దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన టాక్సిక్ ను జూన్ 4వతేదీకి వాయిదా వేసారు. అలాగే 2022 లో రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు కొన్ని హాలీవుడ్ , భారతీయ సినిమాలు భారీగా ప్రభావిత మయ్యాయి. 'ది బాట్ మ్యాన్' చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ రష్యాలో విడుదలను నిలిపివేసింది.
అలాగే'మోర్బి యస్' అనే చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రష్యాలో రిలీజ్ ఆపేసింది. అలాగే 'ఆర్ఆర్ఆర్ 'సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ ముందు షూట్ చేశారు. అప్పటి యుద్ధం వల్ల ఆ ప్రాంతంలో ప్రమోషన్లు నిలిపివేసారు. ప్రపంచ యుద్ధాల సమయంలో అంటే వరల్డ్ వార్స్ సమయంలో అనేక సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. 1971 భారత్-పాక్ యుద్ధం సమయంలో కొన్ని హిందీ సినిమాల ప్రదర్శనలు నిలిపివేసారు. పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టిన నేపథ్యంలోనూ కొన్ని సినిమా రిలీజ్ లు ఆపేసారు.
యుద్దాల సమయంలో రిలీజ్ లు ఆపకపోతే పెద్ద ఎత్తున నష్టాలు తప్పవు. గల్ఫ్ దేశాలు, రష్యా, యూరప్ వంటి ప్రాంతాల్లో థియేటర్లు మూతపడితే నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుంది. అలాగే యుద్ధం జరుగుతున్న దేశాల్లో షూటింగ్ చేయడం అసాధ్యం , ప్రమాదకరం. ఆ సమయంలో చాలా దేశాల్లో పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లిపోతుంది. మరి బాలీవుడ్ చిత్రం 'ధురంధర్ 2' వాయిదా పడుతుందా? అంటే అందుకు ఆస్కారం చాలా తక్కువగా ఉంది. 'ధురంధర్' చిత్రాన్ని గల్ప్ దేశాలు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో రిలీజ్ అయిన ధురందర్ తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉందని ఓ సెక్షన్ ఆడియన్స్ డిమాండ్ చేయడంతో నిలిపి వేసారు. ఈ నేపథ్యంలో 'ధురంధర్ 2'ని ఆయా దేశాల్లో రిలీజ్ చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
