ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!
సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉండేవాళ్లను మనం చాలామందే చూస్తుంటాం. రోజూ ఒకటో రెండో సినిమాలు చూడటమే పెద్ద సాహసంగా భావిస్తుంటాం.
By: Madhu Reddy | 2 Nov 2026 12:20 PM ISTసినిమా అంటే పిచ్చి ప్రేమ ఉండేవాళ్లను మనం చాలామందే చూస్తుంటాం. రోజూ ఒకటో రెండో సినిమాలు చూడటమే పెద్ద సాహసంగా భావిస్తుంటాం. కానీ, అమెరికాకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్ ఆఫీసర్ గ్లెన్వుడ్ హోస్కిన్ జూనియర్ మాత్రం ఏకంగా ఏడాదిలో 1,207 సినిమాలు థియేటర్లలో చూసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. సగటున రోజుకు 3.3 సినిమాలు వీక్షిస్తూ ఆయన సృష్టించిన ఈ అరుదైన గిన్నిస్ రికార్డు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ మారుతోంది. ఆ విశేషాలు చూద్దాం.
777 సినిమాల రికార్డును బద్దలు కొట్టిన గ్లెన్వుడ్:
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన గ్లెన్వుడ్ హోస్కిన్ సినిమాలపై ఉన్న మక్కువతో గిన్నిస్ రికార్డులపై ఆన్లైన్లో రీసెర్చ్ చేశారు. గతంలో ఒక ఏడాదిలో ఒకే థియేటర్లో 777 సినిమాలు చూసిన జకారియా స్వోప్ పేరిట రికార్డు ఉండేది. ఆ రికార్డును బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్న గ్లెన్వుడ్, ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో పెన్సిల్వేనియాలోని రీగల్ సినిమా థియేటర్లో ఏకంగా 1,207 సినిమాలు చూసి సరికొత్త చరిత్ర సృష్టించారు.
పక్కా ప్లానింగ్.. తక్కువ ఖర్చుతోనే సాహసం:
ఇన్ని సినిమాలు చూడటానికి లక్షలు ఖర్చు అవుతాయని అనుకుంటే పొరబడినట్టే. గ్లెన్వుడ్ కేవలం నెలకు సుమారు 28 డాలర్లు మన కరెన్సీలో రూ.2,500 చెల్లించేలా 'రీగల్ అన్లిమిటెడ్ కార్డ్' తీసుకున్నారు. ఇక ఖర్చు తగ్గించుకోవడానికి ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకునేవారు. ఏ సినిమాలకు తక్కువ రన్‌టైమ్ ఉందో తెలుసుకుంటూ థియేటర్ సిబ్బంది సహాయంతో రోజూ పక్కా షెడ్యూల్ ప్లాన్ చేసుకునేవారు. విరామ సమయాల్లో థియేటర్ బయట నడుస్తూ వ్యాయామం కూడా చేసేవారట.
కార్టూన్లు, కామెడీ సినిమాలంటే అమితమైన ఇష్టం:
ఆయనకు కార్టూన్ చిత్రాలు, కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రేక్షకులతో కలిసి నవ్వుకుంటూ సినిమాలు చూడటం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ‘ది వైల్డ్ రోబోట్’, ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ సినిమాలు తనకు చాలా ఇష్టమైనవని వెల్లడించారు. ఇక సినిమా చూడటం అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది తనకు ఒక పెద్ద సవాలు మరియు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇక మొత్తానికి చూస్తే, సినిమాలపై ఉన్న ఇష్టం క్రమశిక్షణ, పట్టుదల, సరైన ప్రణాళిక తోడైతే ఎలాంటి అసాధ్యమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని గ్లెన్వుడ్ నిరూపించారు. కేవలం వినోదంగా ప్రారంభమైన ఆయన సినిమా ప్రయాణం నేడు గిన్నిస్ వరల్డ్ రికార్డులెక్కి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అబ్బురపరుస్తోంది.
