Begin typing your search above and press return to search.

తమన్ ఒరిజినల్ పేరేంటి? ఇంత కథ ఉందా?

టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఎస్.ఎస్. తమన్ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఉందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఎప్పటినుంచో ఆసక్తి కలిగిస్తున్నాయి.

By:  M Prashanth   |   20 March 2026 10:57 PM IST
తమన్ ఒరిజినల్ పేరేంటి? ఇంత కథ ఉందా?
X

టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఎస్.ఎస్. తమన్ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఉందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఎప్పటినుంచో ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ పేరు వెనుక ఉన్న అసలు కథను స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన తమన్, ఆ తర్వాత పూర్తిగా సంగీతంపై దృష్టి సారించారు. ప్రస్తుతం వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ తన కెరీర్‌ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే, చాలా మంది ఎస్.ఎస్. తమన్ అనేది ఆయన అసలు పేరు అనుకుంటారు. కానీ నిజానికి తమన్ ఒరిజినల్ నేమ్ ఘంటసాల శివకుమార్.

తనకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలని భావించిన ఆయన, పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఇటీవల వివరించారు. "నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలి అనిపించింది. అలాగే నా పేరులో ఎలాంటి మతపరమైన ఛాయలు ఉండకూడదని అనుకున్నాను. ఆ సమయంలో గూగుల్ అనే పదం చాలా వెరైటీగా అనిపించింది. దానికి దగ్గరగా ఉండేలా తమన్ అనే పేరు పెట్టుకున్నాను" అని ఆయన తెలిపారు.

అలా పూర్తిగా కొత్తగా, వినూత్నంగా ఉండే పేరును ఎంచుకున్నానని చెప్పారు. తమన్ తండ్రి ఘంటసాల శివకుమార్ కూడా ప్రముఖ సంగీత విద్వాంసులు. అయితే, ఆ పేరును మోయడం తనకు కెరీర్ ప్రారంభంలో కష్టంగా అనిపించిందని ఆయన భావోద్వేగంతో చెప్పారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన, తన ప్రతి పని కూడా తండ్రి పేరుపై ప్రభావం చూపుతుందనే భయంతో ఉండేవాడినని తెలిపారు.

"నేను ఏదైనా తప్పు చేస్తే ఆ మచ్చ మా నాన్నగారి పేరుకు అంటుకుంటుందనే భయం ఉండేది. అందుకే ఆయన పేరును కాపాడుకోవాలని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని" అని తమన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పేరు ఎప్పటికీ గౌరవంగా నిలవాలని నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. తన జీవితంలో విలువైన సంఘటనలను కూడా పంచుకున్నారు. తన తండ్రి తన కోసం కొనిచ్చిన తొలి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు.

ఆ సమయంలో ఆ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి తన తల్లి ఎంతటి త్యాగం చేయడానికి సిద్ధపడిందో కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, ఆ పరిస్థితులు తనలో మరింత బాధ్యత పెంచాయని తమన్ తెలిపారు. తన కెరీర్‌ లో తీసుకున్న ప్రతి నిర్ణయం స్వతంత్రంగా తీసుకున్నదేనని, కానీ ఎప్పుడూ తన తండ్రి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నానని చెప్పారు. తన విజయాల వెనుక తన తండ్రి ఆశీస్సులు, తన కృషి ముఖ్య కారణమని ఆయన స్పష్టం చేశారు.