ఘాటి, మిరాయ్.. సస్పెన్స్ కంటిన్యూస్..!
స్టార్ సినిమాలేమో పండగకి.. ఒక పర్ఫెక్ట్ టైం కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంటే.. ఆ డేట్స్ కాని డేస్ లో మిగతా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటాయి.
By: Ramesh Boddu | 20 Aug 2025 9:36 AM ISTస్టార్ సినిమాలేమో పండగకి.. ఒక పర్ఫెక్ట్ టైం కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంటే.. ఆ డేట్స్ కాని డేస్ లో మిగతా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటాయి. అసలు కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడొచ్చినా కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. కానీ కొన్ని సినిమాలు సరైన టైంలో రిలీజ్ చేయకపోవడం వల్ల కూడా నిరాశపరుస్తాయి. కమర్షియల్ సక్సెస్ అందుకునే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా బ్యాడ్ రిలీజ్ వల్ల ఆశించిన సక్సెస్ అందుకోదు. అందుకే కొన్ని సినిమాలు రిలీజ్ విషయంలో పట్టుబడుతుంటారు.
రిలీజ్ క్లాష్ అనేది చాలా కామన్..
టాలీవుడ్ లో ఈ రిలీజ్ క్లాష్ అనేది చాలా కామన్. ఎవరు తగ్గుతారా ఎవరు ముందుకొస్తారా అన్నది తెలియదు. ప్రతి సీజన్ లో ఇలాంటి రిలీజ్ క్లాష్ కామన్. ఐతే ఈసారి సీనియర్ హీరోయిన్ సినిమాకు యువ హీరో క్రేజీ ప్రాజెక్ట్ పోటీ వస్తుంది. అవే అనుష్క చేస్తున్న ఘాటి, తేజా సజ్జ చేస్తున్న మిరాయ్. ఈ రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్నాయి.
ఘాటి సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయగా ఆఫ్టర్ లాంగ్ టైం అనుష్క సోలోగా అదరగొట్టేందుకు వస్తుంది. ఇక హనుమాన్ సక్సెస్ తర్వాత తేజా మార్కెట్ బాగా పెరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో కూడా అతని సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తేజా సజ్జ మిరాయ్ కూడా మంచి కాన్సెప్ట్ తో వస్తుండటం వల్ల హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు.
రెండు సినిమాలు రిస్క్ లో పడే ఛాన్స్..
ఐతే అనుష్క ఘాటి, తేజా సజ్జ మిరాయ్ రెండు కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఐతే రీసెంట్ గా రెండు సినిమాలకు సంబందించిన నిర్మాతలు మాట్లాడుకున్నారట. పోటీ వల్ల రెండు సినిమాలు రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. అందుకే ఒకటి వాయిదా వేయాలని అనుకుంటున్నారట. ఐతే ఘాటి, మిరాయ్ ఈ రెండిటిలో ఏది సెప్టెంబర్ 5న వస్తుంది. ఏది వాయిదా పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.
అసలే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా వస్తే మిగతా సినిమాలు నిలబడటం కష్టం. అందుకే ఓజీ ముందే ఈ సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకే మిరాయ్, ఘాటిల్లో సెప్టెంబర్ 5న ఒక సినిమా.. సెప్టెంబర్ 12న మరో సినిమా వచ్చేలా చర్చిస్తున్నారట. ఐతే ఏది ముందొస్తుంది. ఏ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.
