అనుష్క 'ఘాటీ'.. బిగ్ డీల్ ఫిక్స్!
సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ లో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన వయొలెంట్ యాక్షన్ మూవీ ఘాటీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 1 Sept 2025 12:26 AM ISTసీనియర్ అండ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ లో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన వయొలెంట్ యాక్షన్ మూవీ ఘాటీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వేదం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ సినిమా.. సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్ర చేయగా.. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మించారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో జరిగే కథతో మూవీని రూపొందించారు. అనుష్క, విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటీలుగా సినిమాలో కనిపించనున్నారు.
ఇప్పటికే వచ్చి ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం, మూవీలో అనుష్క, విక్రమ్ తాము చేస్తున్న పని తప్పని తెలుసుకుని ఆ నేర వృత్తి నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత గంజాయి ముఠా వ్యవస్థపై తిరుగుబాటుకు సిద్ధమవుతారు. అప్పుడు ఏం జరిగింది? వారికి ఎదురైన సవాళ్లేంటి? అనే కథాంశంతో సినిమాను ఉండనున్నట్లు అర్థమవుతోంది.
అయితే ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదల కానుండగా.. ఆడియన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. అదే సమయంలో సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈ మేరకు నిర్మాత రాజీవ్ రెడ్డి వెల్లడించారు.
ఘాటీ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.50 కోట్లు పలికాయని ఆయన తెలిపారు. కొన్ని నెలల క్రితం ఒప్పందం క్లోజ్ అయిందని, బెస్ట్ రేట్ అని చెప్పారు. థియేటర్లలో సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు చాలా కాలం తర్వాత అనుష్కను స్క్రీన్ పై చూడటానికి సంతోషిస్తారని వెల్లడించారు.
అదే సమయంలో సినిమా థియేట్రికల్ రైట్స్ నూ మంచి ధరకు మేకర్స్ కోట్ చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ హక్కులను రూ.10 కోట్లకు.. సీడెడ్ రైట్స్ ను రూ.4 కోట్లకు.. నైజాంకు రూ.7 కోట్లకు సేల్ చేశారని సమాచారం. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్న ఘాటీ.. యూ/ఏ సర్టిఫికెట్ కూడా అందుకుంది. మరి ఘాటీ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
