ఘాటి.. క్రిష్ ఒంటరి పోరు
సెప్టెంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘాటి సినిమా మీద డీసెంట్ బజ్ ఉంది కానీ సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ కు ఈ సౌండ్ అయితే సరిపోదు.
By: M Prashanth | 1 Sept 2025 9:52 AM ISTసెప్టెంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘాటి సినిమా మీద డీసెంట్ బజ్ ఉంది కానీ సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ కు ఈ సౌండ్ అయితే సరిపోదు. మేకర్స్ కాస్త ప్రమోషన్స్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అనుష్క శెట్టి పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడంతో సినిమాపై మొదట ఆసక్తి పెరిగింది. వరుసగా పోస్టర్స్ టీజర్స్ ద్వారా ఏదో కొత్తగా అయితే ట్రై చేశారనే అభిప్రాయం ఉంది.
ఏదేమైనా సినిమాను కాస్ట్ జనాల్లోకి తీసుకు వెళితేనే లాభం ఉంటుంది. ఇక అనుష్కకు ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇంపాక్ట్ ఏమీ ఉండదని చెప్పవచ్చు. కానీ దర్శకుడు క్రిష్ మాత్రం ఓ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. అతను కమర్షియల్ గా హిట్టు కొట్టి చాలా కాలమైంది. అయితే ఈసారి ఘాటినీ జనాల్లోకి తీసుకు వెళ్లే భారం క్రిష్ పైనే పడింది. ఘాటి సినిమాకు ప్రధాన ఆయుధమే అనుష్క. అయితే ఆమె ముందుగానే ప్రమోషన్స్ కు రానని కండిషన్ పెట్టడంతో క్రిష్ ఒంటరి పోరు చేయక తప్పడం లేదు.
ఇక తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు క్రిష్ సినిమా వెనుక ఉన్న ఆలోచనలు, అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా అనుష్క ప్రమోషన్స్ పై వచ్చిన ప్రశ్నలే హైలైట్‌గా మారాయి. దీనిపై దర్శకుడు క్రిష్ స్పందిస్తూ.. “అనుష్క ప్రమోషన్స్‌కు రావడం లేదా రావకపోవడం పూర్తిగా ఆమె పర్సనల్ ఛాయిస్. కానీ ‘ఘాటి’కి అనుష్క ప్రమోషన్ అవసరం లేదు. ఆమె నటన ఒక్కటే ఈ సినిమాకు సరిపోతుంది. ‘శీలావతి’ పాత్రలో ఆమె తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది” అని స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదేవిధంగా క్రిష్ మరో కీలక క్లారిటీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు నుంచి తాను తప్పుకోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ.. “పవన్ గారు నాకు ఎంతో ఇష్టమైన వారు. ఏఎం రత్నం గారిని నేను ఎంతో గౌరవిస్తాను. వారితో ఎలాంటి విభేదాలు లేవు. కానీ కోవిడ్ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్లే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు.
ఇక ఘాటి సినిమాపై క్రిష్ నమ్మకం వ్యక్తం చేశారు. తూర్పు ఘాట్ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను నిర్మించామని, అక్కడి ప్రజల జీవన విధానం, శక్తివంతమైన భావోద్వేగాలు, డ్రామా ఈ సినిమాలో ప్రతిఫలించాయని చెప్పారు. జగపతి బాబు, విక్రమ్ ప్రభు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిపారు. ఇక అనుష్క ప్రమోషన్స్ కు రాకపోవడం ఆమె పర్సనల్ ఛాయిస్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది. ఇక దర్శకుడు క్రిష్ తనవంతు ప్రమోషన్స్ చేసి మౌత్ టాక్ మీద ఆదారపడాల్సిందే.
