అనుష్క తేలిపోయింది.. రష్మిక ఏం చేస్తుందో..?
అలాంటి అనుష్కతో క్రిష్ లేటెస్ట్ గా ఘాటి సినిమా చేశాడు. ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. చూస్తుంటే సినిమా జనాలకు అసలేమాత్రం ఎక్కలేదనిపిస్తుంది.
By: Ramesh Boddu | 7 Sept 2025 7:00 PM ISTస్టార్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు వెండితెర మీద ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఒకప్పటి విజయశాంతి నుంచి నయనతార, అనుష్క, సమంత ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక క్రేజ్ తెచ్చింది మాత్రం అనుష్క అనే చెప్పొచ్చు. ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలా ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే మధ్యలో కొన్ని ట్రాక్ తప్పినా కూడా అనుష్క తో ఫిమేల్ సెంట్రిక్ సినిమా అంటే చాలు మినిమం గ్యారెంటీ అనేలా ఉండేది.
అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడంతో..
అలాంటి అనుష్కతో క్రిష్ లేటెస్ట్ గా ఘాటి సినిమా చేశాడు. ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. చూస్తుంటే సినిమా జనాలకు అసలేమాత్రం ఎక్కలేదనిపిస్తుంది. అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడంతో పెద్దగా బజ్ కూడా లేదు. ఫలితంగా సినిమా ఫెయిల్యూర్ గా నిలిచేట్టుగానే ఉంది. క్రిష్, అనుష్క కలిసి ఒక మంచి ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ఘాటిల జీవిత కథతో ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ డైరెక్టర్ గా క్రిష్ ఫెయిల్ అయ్యాడు. అనుష్క తన పాత్ర వరకు బాగా చేసింది.
ఐతే ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో టాప్ అనిపించిన అనుష్క ఘాటి బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. ఇక నెక్స్ట్ రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆ సినిమా కూడా రష్మిక ప్రధాన పాత్రతోనే వస్తుంది. దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా చేసినా కూడా ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ రోల్ మాత్రం రష్మికదే అని తెలుస్తుంది.
రష్మిక మందన్న సినిమా..
మరి అనుష్క సినిమా రిజల్ట్ తేలిపోయింది. మరి రష్మిక ఏం చేస్తుంది అన్నది చూడాలి. రష్మిక మందన్న సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటుంది. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అయితే ఇంప్రెస్ చేశాయి.
అనుష్క, రష్మిక ఇద్దరు తమ పాత్రల వరకు ది బెస్ట్ ఇస్తూ వచ్చారు. కానీ ఘాటి కోసం అనుష్క పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయ్యింది. మరి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. రష్మిక మందన్న ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తుంది.
రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. బాలీవుడ్ లో కూడా రష్మిక వరుస ఆఫర్లు అందుకుంటుంది. రష్మిక ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను హిందీలో కూడా భారీగానే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా విషయంలో రష్మిక మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది.
