Begin typing your search above and press return to search.

ఘాటీ ఏదీ తేల్చ‌డం లేదుగా!

కొన్ని సినిమాలు ఏ ముహూర్తాన మొద‌ల‌వుతాయో కానీ అవి రిలీజ‌వ‌డానికి ఎన్నో ఆటంకాలు ఎదుర‌వుతూ ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 July 2025 8:00 PM IST
ఘాటీ ఏదీ తేల్చ‌డం లేదుగా!
X

కొన్ని సినిమాలు ఏ ముహూర్తాన మొద‌ల‌వుతాయో కానీ అవి రిలీజ‌వ‌డానికి ఎన్నో ఆటంకాలు ఎదుర‌వుతూ ఉంటాయి. చెప్పుకోలేని కార‌ణాల వ‌ల్ల వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంటాయి. అలాంటి కోవ‌లోకే వ‌స్తుంది టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న ఘాటీ సినిమా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా ఘాటీ.

ఇప్ప‌టికే రెండుసార్లు వాయిదాలు

వీర‌మ‌ల్లు సినిమా లేట‌వుతుంద‌ని ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌టికొచ్చి మ‌రీ క్రిష్ ఈ సినిమాను మొద‌లుపెట్టారు. మొద‌ట్లో చాలా ఫాస్ట్ గానే షూటింగ్ ను కూడా చేశారు. కానీ త‌ర్వాత్త‌ర్వాత ఘాటీ లేట‌వుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా రెండు సార్లు పోస్ట్‌పోన్ అయింది. ముందు ఏప్రిల్ 18న రిలీజ్ చేద్దామ‌నుకున్నారు, ఆ త‌ర్వాత జులై 11 అన్నారు. కానీ ఆ రెండు డేట్స్ లో ఘాటీ రాలేదు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ల్లే లేటు

ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటీ వాయిదా ప‌డుతూనే ఉంది. ఏదో చెప్పాలి కాబ‌ట్టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ల్ల లేట‌వుతుందంటున్నారు కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాటీ ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి కాలేదంటే న‌మ్మశ‌క్యంగా లేదు. అస‌లు సినిమా ఎందుకు వాయిదా ప‌డుతుంద‌నేది చిత్ర యూనిట్‌కే తెలియాలి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఘాటీ మూవీ సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతుంద‌ని మొన్న‌టివ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడా సూచ‌న‌లు కూడా క‌నిపించ‌డం లేదు.

ఎటూ తేల్చ‌ని ఘాటీ టీమ్

ఇప్పుడ‌దే డేట్ లో తేజ సజ్జ మిరాయ్ వ‌స్తుంది కాబ‌ట్టి ఘాటీ రాన‌ట్టే. ఒక‌వేళ తేజ స‌జ్జ సినిమా ఏం పోటీలే అని వద్దామ‌నుకుంటే ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టాల్సింది కానీ ఇంకా ఘాటీ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. అటు డైరెక్ట‌ర్ క్రిష్ కానీ, ఇటు నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ కానీ, హీరోయిన్ అనుష్క కానీ ఈ సినిమా ఊసే ఎత్త‌క‌పోగా అస‌లెక్క‌డా బ‌య‌ట క‌నిపించ‌డం కూడా మానేశారు. ఏదేమైనా రిలీజ్ డేట్ విష‌యంలో నిర్మాణ సంస్థ ఏదొక క్లారిటీ ఇస్తే బెట‌ర్.

బ‌య‌ట‌కు రాని స్వీటీ

ఇదిలా ఉంటే అనుష్క మాత్రం మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా త‌ర్వాత బ‌య‌టెక్క‌డా క‌నిపించింది లేదు. ఆ సినిమాతో హిట్ అందుకున్నా సైలైంట్ గానే ఉన్నారు త‌ప్పించి బ‌య‌ట‌కు ఎక్స్‌పోజ్ అవ‌లేదు. త‌న గురించి, త‌న సినిమాల గురించి ఎన్ని వార్త‌లొస్తున్నా స‌రే అవేవీ ప‌ట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు త‌ప్పించి బ‌య‌ట‌కు మాత్రం రావ‌డం లేదు.