జార్జియా ను రౌండప్ చేసిన తెలుగు స్టార్స్
సూపర్ స్టార్ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `వారాణిసి` షూటింగ్ ఇండియా నుంచి జార్జియాకు షిప్ట్ అవ్వడంతో? చర్చంతా జార్జియా గురించే జరుగుతోంది.
By: Srikanth Kontham | 17 Feb 2026 9:32 AM ISTసూపర్ స్టార్ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `వారాణిసి` షూటింగ్ ఇండియా నుంచి జార్జియాకు షిప్ట్ అవ్వడంతో? చర్చంతా జార్జియా గురించే జరుగుతోంది. ఇప్పటికే వారణాసి అక్కడ ఎలాంటి లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుందో? విషయం బయటకు వచ్చేసింది. జార్జియాలో ఎన్నో ఎగ్జోటిక్ లోకేషన్స్ లో జక్కన్న షూటింగ్ ప్లాన్ చేసారు. ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకుని సిద్దంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ ఎంతో కఠినమైంది కూడా. జార్జియాలో షూటింగ్ అనుభవం మహేష్ కి ఇదే తొలిసారి. ఇంత వరకూ ఆయన ఏ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లలేదు.
తొలిసారి ఆఎక్స్ పీరియర్స్ చూడబోతున్నారు. మరి ఇంత వరకూ జార్జియాలో షూటింగ్ చేసిన తెలుగు హీరోలు ఎంత మంది అంటే చాలా మాందే కనిపిస్తు న్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే?? ప్రభాస్ హీరోగా నటించిన `రాధేశ్యామ్` షూటింగ్ సమయంలో జార్జియాలో ఓ భారీ షెడ్యూల్ జరిగింది. సినిమాలో ఇది ఎంతో ప్రధానమైన షెడ్యూల్ ఇది. కరోనా సమయంలో సాహసం చేసి మరి అక్కడ కీలక సన్నివేశాలు ఒక సాంగ్‌ను చిత్రీకరించారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్ కోసం జార్జియాను ఉపయోగించుకున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `అజ్ఞాతవాసి` షూటింగ్ కూడా జార్జియాలో జరిగింది.
ఈ సినిమాలోని `గాలి వాలుగా` అనే పాటను జార్జియాలోని అందమైన రోడ్లు, మంచు కొండల మధ్య షూట్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `సైరా నరసింహారెడ్డి`కి జార్జియా కీలకంగా మారింది. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాలను జార్జియాలోనే చిత్రీకరించారు. దాదాపు 1500 మందికి పైగా సిబ్బందితో అక్కడ భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేసారు. ఇంకా వరుణ్ తేజ్ హీరోగా నటించిన `అంతరిక్షం`- `గాండీవధారి అర్జున` చిత్రాలు కూడా జార్జి యాలో షూటింగ్ చేసారు. `అంతరిక్షం` లో జీరో గ్రావిటీ సీన్ల కోసం జార్జియాలోని ప్రత్యేక స్టూడియోల్లో షూటింగ్ చేసారు.
`గాండీధారి అర్జున` లో మెజార్టీ యాక్షన్ పార్ట్ అక్కడే పూర్తి చేసారు. రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ`లో ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా అక్కడే చిత్రీకరించారు. బాలకృష్ణ నటించిన `గౌతమీ పుత్రశాతకర్ణి` లో భారీ యుద్ధ సన్నివేశాల కోసం జార్జియాను ఎంచుకున్నారు.వేలాది మంది సైనికులతో గుర్రపు స్వారీ సీన్లను అక్కడ చిత్రీకరించారు. చాలా కాలం క్రితం ఎన్టీఆర్ `శక్తి` సినిమా షూటింగ్ కోసం జార్జియాకు వెళ్లారు. నితిన్ హీరోగా నటించిన `చెక్` సినిమాలో కొన్ని ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన `కింగ్ డమ్` లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ కూడా అక్కడ జరిగింది. తాజాగా `వారణాసి` కీలక సన్నివేశాలు అక్కడే జరుగుతున్నాయి. ఇలా జార్జియా తో టాలీవుడ్ బంధం అంతకంతకు రెట్టింపు అవుతోంది.
