జార్జ్ ఒకవైపు.. క్రిష్ ఇంకోవైపు.. శర్వానంద్ కొత్త అవతారం!
ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Sept 2026 12:22 PM ISTఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టిన ప్రాజెక్ట్ జార్జ్ క్రిష్. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మేకింగ్ సైలెంట్ గా సాగుతోంది. ఈరోజు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ బూస్టర్ పేరుతో ఒక చిన్న వీడియో వదిలారు. ఇందులో శర్వానంద్ రెండు గెటప్స్ లో కనిపించాడు.
ఈ బూస్టర్ వీడియో గమనిస్తే సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేక ఒకే పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్ ఉన్నాయా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఒకవైపు చర్చిలోని ఫాదర్ గెటప్ లో అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న జార్జ్ కనిపిస్తాడు. వెంటనే కట్ చేస్తే పసుపు బట్టలు వేసుకుని అమ్మాయిలతో కలిసి భజన చేసే క్రిష్ వస్తాడు. ఈ రెండు వేరియేషన్స్ చూడ్డానికి ఫన్నీగా ఉన్నాయి.
చర్చి వాతావరణం, గుడి నేపథ్యం బ్యాలెన్స్ చేస్తూ శర్వానంద్ ఎనర్జిటిక్ గా స్టెప్పులేశాడు. వీటితో పాటే కేఫ్ లో హీరోయిన్ మానస వారణాసిని కూడా పరిచయం చేశారు. ఆ షాట్ లో శర్వానంద్ మోడ్రన్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఈ వేరియేషన్స్ బట్టి చూస్తే సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు గట్టిగానే స్కోప్ ఉందనిపిస్తోంది.
క్యారెక్టరైజేషన్స్ మీద డైరెక్టర్ వైట్ల బాగానే ఫోకస్ పెట్టాడు.
శ్రీను వైట్ల అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన మార్క్ కామెడీ టైమింగ్. ఈ బూస్టర్ లో డైలాగ్స్ లేకపోయినా విజువల్స్ పరంగా కలర్ ఫుల్ వైబ్ క్రియేట్ చేశారు. ఒకప్పటి తన వింటేజ్ వినోదాన్ని తెరపైకి తీసుకురావడానికి ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నట్లు ఈ మేకింగ్ చూస్తే తెలుస్తోంది. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటి రోల్స్ సెట్ అవుతాయి కాబట్టి అవుట్ పుట్ బెటర్ గా ఉండొచ్చు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిన్న గ్లింప్స్ కు అనూప్ రూబెన్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు తగ్గట్టుగా సాగింది. టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వైట్ల సినిమాలకు మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యేదో తెలిసిందే. ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా అనూప్ కేచి ట్యూన్ తో వచ్చాడు.
ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫెస్టివల్ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్స్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. మరి చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వెతుకుతున్న శ్రీను వైట్లకు, శర్వానంద్ తో చేస్తున్న ఈ ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
