చర్చి వెనుక సీక్రెట్ గా ముద్దు పెట్టేసిన నటుడు!
హాలీవుడ్ హీరో కం దర్శక నిర్మాత జార్జ్ క్లూనీ గురించి పరిచయం అవసరం లేదు. సీనియర్ స్టార్ గా ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు.
By: Srikanth Kontham | 8 Jan 2026 12:00 AM ISTహాలీవుడ్ హీరో కం దర్శక నిర్మాత జార్జ్ క్లూనీ గురించి పరిచయం అవసరం లేదు. సీనియర్ స్టార్ గా ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు. 'రివేంజ్', 'రిటర్న్ ఆఫ్ ది హారర్ హై', 'రిటర్న్ ఆఫ్ ది కిల్లర్ టోమోటోస్' లాంటి సినిమాలతో 80స్ లోనే ఓ వెలుగు వెలిగారు. అప్పటి నుంచి జార్జ్ క్లూనీ ప్రస్తానం దిగ్విజయంగా కొనసాగుతుంది. గత ఏడాది 'ది డిటెక్టివ్', 'జెకెల్లీ' లాంటి సినిమాలతోనూ అలరించారు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు. రాజకీయ విశ్లేషణలు కూడా చేయడం జార్జ్ క్లూ ప్రత్యేకత. అమెరికా ఎన్నికల్లో జో బైడన్ ఓడిపోతాడని ముందే హింట్ ఇచ్చింది ఈయనే.
తాజాగా ఈ సీనియర్ నటుడు 11 ఏళ్ల వయసులో పెట్టిన ముద్దు గురించి తొలిసారి ఓపెన్ అయ్యారు. 11 ఏళ్ల వయసులోనే జార్జ్ క్లూనీ ఓ చర్చి వెనుకు సీక్రెట్ గా ఓ అమ్మాయికి ముద్దు పెట్టాడుట. ఈ ఘటన తన సొంత ఊరైనా కెంటకీలోని అగస్టా చర్చి వెనుక జరిగిందన్నారు. బయట ఉన్న తన స్నేహితులంతా ఆమెని ముద్దు పెట్టుకోవాలని స్నేహితులంతా అరుస్తుంటే? ఇద్దరు చర్చి వెనుక భాగంలో దాగున్నారు. ఆక్షణంలో ఇద్దరు ముద్దు పెట్టుకు న్నారుట. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదన్నారు. 11 ఏళ్ల వయసులో బంధాలు అంతే బలహీనంగా ఉంటాయని, కానీ అలాంటి సంఘటనలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో సరదా సంఘటనలు ఉంటాయని, బాల్యం లో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తుంటామన్నారు. అలాగే కెరీర్ లో ఎదుర్కొన్న ఓ కఠిన పరిస్థితిని కూడా గుర్తు చేసుకున్నారు. ఓటీవీ షోలో ఎగ్జిక్యూటివ్ నిర్మాతతో వివాదం తలెత్తిన సమయంలో కెరీర్ ముగిస్తుందని భయపడినట్లు చెప్పుకొచ్చారు. ఆ నిర్మాత అమర్యాదగా మాట్లాడటంతో తాను ప్రతి దాడికి దిగినట్లు తెలిపారు. దీంతో అప్పటికప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నానన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం తన సహాయం పొందిన మరో స్నేహితుడు ద్వారా మళ్లీ మరో ఛాన్స్ వచ్చిందన్నారు.
ఆ ఛాన్స్ కారణంగానే కెరీర్ మళ్లీ పుంజుకుందన్నారు. అప్పటి నుంచి తాను కూడా కోపం తగ్గించుకుని సమయ స్పూర్తితో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మనిషిలో స్వార్దం, నిజాయితీ లోపించడాన్ని తాను ఎంత మాత్రం సహిం చలేనన్నారు. ప్రస్తుతం జార్జీ క్లూనీ దర్శక, నిర్మాతగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. 2002లోనే 'కన్ప్యూజన్స్ ఆఫ్ డెంజరస్ మైండ్'అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అటుపై `గుడ్ నైట్ గుడ్ లక్` సహా మరో ఐదారు సినిమాలు డైరెక్ట్ చేసారు. కానీ నటుడిగా చూపించిన ఆసక్తి దర్శకుడిగా చూపించలేదు.
