Begin typing your search above and press return to search.

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

జెనీలియా తాజాగా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ తర్వాత దర్శకుడు ఆదిత్య దత్, ఇమ్రాన్ హష్మీ మళ్లీ కలిసిన ఈ సినిమాలో అపర్‌శక్తి ఖురానా కూడా నటిస్తున్నారు. నవంబర్ 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 4:00 AM IST
సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?
X

జెనీలియా ఇటీవలే తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ సరసన నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం `రాజా శివాజీ`తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రితేష్ స్వ‌యంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి జెనీలియా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇది మరాఠా, హిందీలో విడుద‌లై బంప‌ర్ హిట్టు కొట్టింది. ఇద్ద‌రు కిడ్స్ కి బాధ్య‌తాయుత‌మైన త‌ల్లిగా, దేశ్ ముఖ్ వైఫ్ గా ఉంటూనే, న‌టిగా, నిర్మాత‌గాను తానేంటో నిరూపిస్తోంది జెనీలియా. సంసార బాధ్య‌త‌లు ఒక‌వైపు.. న‌టిగా ఛాలెంజ్ మ‌రోవైపు.. ప్ర‌తిదీ స‌వ్యంగా నెర‌వేరుస్తోంది.

తెలుగు లోగిళ్ల‌లో అల్ల‌రి హాసినిగా హృద‌యాల‌ను గెలుచుకున్న జెనీలియా, ఇప్పుడు ఎంతో ప‌రిణ‌తి చెందిన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఇమ్రాన్ హ‌ష్మీ `గ‌న్ మాస్ట‌ర్ జీ-9` చిత్రంలో ఒక ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కానీ, టీజ‌ర్ కానీ విడుద‌ల కాక‌పోవ‌డంతో త‌న పాత్ర ఎలా ఉంటుందో పూర్తి స‌మాచారం లేదు. అయితే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమానే అయినా ఇందులో జెనీలియా పాత్ర కీల‌కంగా ఉండ‌బోతోంద‌ని మాత్రం తెలుస్తోంది.

తాజా ప్ర‌మోష‌న‌ల్ వేదిక‌పై ఇమ్రాన్ హ‌ష్మి మాట్లాడుతూ జెనీలియాతో క‌లిసి న‌టించ‌డాన్ని ఎంతో ఆస్వాధించాన‌ని అన్నారు. అంతేకాదు త‌న‌కు 20 ఏళ్ల క్రితం సీరియ‌ల్ కిస్స‌ర్ గా పాపుల‌ర్ చేసిన త‌న ద‌ర్శ‌కుడు ఆదిత్యా ద‌త్ గురించి స‌ర‌దా వ్యాఖ్య‌లు చేసారు. ఆరోజు ఆయ‌న త‌న‌ను అలా చేయ‌డం వ‌ల్ల ఇండ్ల‌లో త‌న సినిమాలు చూసేప్పుడు పిల్ల‌ల్ని త‌ల్లిదండ్రులు వెంట‌నే బెడ్ రూమ్ కి పంపి నిద్ర పుచ్చేవార‌ని ప‌రిహాసంగా మాట్లాడారు. నాటి ఆ ముద్ర ఇప్ప‌టికీ తొల‌గిపోలేద‌ని అన్నారు.

2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `ఆషిక్ బనాయా ఆప్నే` తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయడం ఇదే.. గన్‌మాస్టర్ G9 కోసం మ‌ళ్లీ ద‌త్-హ‌ష్మీ క‌లిసారు. ఈ జోడీ జెనీలియాను ఎంపిక చేయ‌డం కూడా ఆస‌క్తిని పెంచింది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ క్రేజీ కాంబినేష‌న్‌తో క‌లిసి `ఆషిక్ బానాయా ఆప్నే` చిత్రానికి చార్ట్ బ‌స్ట‌ర్ సంగీతాన్ని అందించిన ఇమ్రాన్ హ‌ష్మీ కూడా క‌లిసి ప‌ని చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

కెరీర్ ఆరంభంలోనే మ్యూజిక‌ల్ హిట్స్ అందించిన ఈ కాంబినేష‌న్ ఇంత‌కాలానికి రిపీట‌వుతుండ‌టంతో అభిమానుల్లోను కొత్త ఉత్సాహం న‌లెకొంది. ఇక యాక్షన్-ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న `గన్‌మాస్టర్ G9` చిత్రంలో అపర్‌శక్తి ఖురానా మ‌రో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ ఆషిక్ బానాయా ఆప్నే కాంబినేష‌న్ తో జెనీలియా ప‌ని చేస్తుండ‌టంతో త‌న అభిమానుల్లోను ఉత్కంఠ నెల‌కొంది.