Begin typing your search above and press return to search.

జెనీలియా కొత్త అవతారం.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

బొమ్మరిల్లు, రెడీ,ఢీ, శశిరేఖ పరిణయం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైనా జెనీలియా గత కొద్ది సంవత్సరాల నుండి టాలీవుడ్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే

By:  Madhu Reddy   |   6 Sept 2025 8:00 PM IST
జెనీలియా కొత్త అవతారం.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
X

బొమ్మరిల్లు, రెడీ,ఢీ, శశిరేఖ పరిణయం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైనా జెనీలియా గత కొద్ది సంవత్సరాల నుండి టాలీవుడ్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెళ్లయ్యాక జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసింది. అప్పుడప్పుడు బాలీవుడ్లో భర్తతో కలిసి మెరిసినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం కనిపించట్లేదు. కానీ రీసెంట్గా కిరీటి,శ్రీలీల కాంబోలో వచ్చిన 'జూనియర్' సినిమాతో మళ్ళీ టాలీవుడ్లోకి వచ్చింది. ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. అయితే జూనియర్ సినిమా తర్వాత జెనీలియా ఇమ్రాన్ హష్మీతో కలిసి 'గన్ మాస్టర్ G9' అనే సినిమాతో మన ముందుకు రాబోతోంది.. ఆదిత్య దత్ దర్శకత్వంలో సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దీపక్ ముకుత్, హునార్ ముకుత్ లు నిర్మిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాలో జెనీలియా పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో నటించబోతుందట.. ఒక మామూలు గృహిణి కుటుంబానికి హాని కలిగినప్పుడు పరాశక్తిగా ఎలా మారుతుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. అయితే ఈ సినిమా స్టోరీ వినగానే జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ఒప్పుకోమని చెప్పారట. ఇలాంటి ఒక పవర్ఫుల్ పాత్రలో నటించడం నిజంగా పెద్ద టాస్కే అని.. ఇందులో నువ్వు కచ్చితంగా నటించాలని జెనీలియాని ఎంకరేజ్ చేశారట.అలా భర్త ప్రోత్సాహంతో సినిమాకి ఒప్పుకున్నట్టు నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ సినిమా జెనీలియాని కొత్తగా పరిచయం చేయబోతుందని భావిస్తున్నారు. అయితే సినిమాల్లో హీరోయిన్లను ఎంత తక్కువ చేసి చూపిస్తారో తెలుసు. కేవలం హీరోలను మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తారు.అలాంటిది ఇప్పుడు జెనీలియా ఓ పవర్ఫుల్ యాక్షన్ స్టోరీలో నటించబోతుండంతో అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

అయితే ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న జెనీలియా.. ఇలాంటి ఒక యాక్షన్ సినిమాలో నటించడం నిజంగా సాహసోపేతమైన ప్రయోగమే అని చెప్పాలి. మరి జెనీలియా ఎంచుకున్న ఈ సినిమా ఆమె కెరీర్ కి సక్సెస్ ఇస్తుందా..? సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా జెనీలియా దశ మార్చబోతోందా.. ? ఈ పాత్ర జెనీలియా కెరీర్ కి ఏ విధంగా దోహదపడుతుంది? అనేది ముందు ముందు చూడాలి.

గన్ మాస్టర్ G9 సినిమా విశేషాలకు వస్తే.. ఈ సినిమాతో ఇమ్రాన్ హష్మీ మళ్లీ తన హిట్ సినిమా డైరెక్టర్ ఆదిత్య దత్ తో కలిసి వర్క్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వీరి కాంబోలో ' ఆషిక్ బనాయా ఆప్నే' అనే కల్ట్ మ్యూజిక్ మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. అలా మళ్ళీ వీరి కాంబోలో గన్ మాస్టర్ G9 రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే..గన్ మాస్టర్ G9 మూవీ దీపావళి తర్వాత ఉత్తరాఖండ్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఈ సినిమా 2026 మొదట్లో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.