ఆయన తో రిలేషన్ షిప్ జీవితం నాశనం!
అమితాబ్-రేఖ మధ్య రిలేషన్ షిప్ పై బాలీవుడ్ మీడియాలో అప్పట్లో ఎన్నో సంచలనమైన కథనాలు.
By: Srikanth Kontham | 19 Aug 2025 3:00 PM ISTఅమితాబ్-రేఖ మధ్య రిలేషన్ షిప్ పై బాలీవుడ్ మీడియాలో అప్పట్లో ఎన్నో సంచలనమైన కథనాలు. వాటి ఆధారంగా దక్షిణాది పరిశ్రమల్లోనూ ఆ రిలేషన్ షిప్ పై సౌత్ మీడియాలోనూ అంతే హైలైట్ అయిన జోడీ అది. ఆన్ ది స్క్రీన్ పైనే కాదు...ఆఫ్ ది స్క్రీన్ లోనూ నిరంతరం చర్చకు తెర తీసిన కాంబినేషన్ అది. ఈ ప్రచారాన్ని అప్పట్లో ఈ జోడీ ఏ నాడు ఖండచను లేదు. ధృవీకరించనూ లేదు. అయితే అప్పటి మీడియాలో రేఖ తండ్రి జెమినీ గణేషన్ వారి రిలేషన్ షిప్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తాజాగా తెరపై కి వచ్చింది.
స్టార్ అండ్ స్టైల్ మ్యాగజైన్ కి జెమినీ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంగతుల బయట పడ్డాయి. కుమార్తె తో అమితాబ్ రిలేషన్ ఫిప్ పై జెమినీ సంచలన వ్యాఖ్యలే చేసినట్లు కనిపిస్తుంది. అమితాబ్ తో సంబంధం పెట్టుకుని రేఖ జీవితం నాశనం చేసుకుందని చాలా మంది చెబుతారు. కానీ ఇది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి తానెందుకు చర్చించాలి? అని ఎదురు ప్రశ్నించారు జెమినీ. ఈ సందర్భంగా జెమినీ తన జీవితాన్ని ఉదహరించారు. సావిత్రి- పుష్పవల్లిని తాను వివాహం చేసుకున్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కున్నానన్నారు.
కానీ దిలీప్ కుమార్, ధర్మేంద్ర లాంటి వారు రెండవ వివాహం చేసుకున్నా? ఎవరూ ఆశ్చర్యపోలేదన్నారు. ఆ కోణంలో చూస్తే? వివాహేతర సంబంధాల పరంగా చూస్తే తనని తానే ఓ ట్రెండ్ సెట్టర్ గా ప్రకటించు కున్నారు. 1954 లో జెమినీ గణేషన్- పుష్పవల్లీకి జన్మించిన బిడ్డే రేఖ. కానీ చట్టబద్దంగా వివాహం చేసు కోలేదు. అప్పటికే జెమినీకి మొదటి భార్య ఉండగా, పుష్ప వల్లి భర్తకు దూరంగా ఉన్నారు. రేఖ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విషాధాలే ఉన్నాయి.
వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ తో వివాహం..అటుపై ముకేష్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం. ఆ తర్వాత రేఖ రెండవ వివాహం చేసుకోలేదు. సింగిల్ గానే జీవితాన్ని నెట్టుకొచ్చారు. సినిమాకే తన జీవితం అంకితంగా పని చేస్తున్నారు. తండ్రి జెమినీ గణేషన్ విషయంలో కూడా రేఖ ఏమాత్రం సంతృప్తిగా ఉండేవారు కాదని అంటారు. తండ్రి మరణానంతరం చివరి చూపుకు కూడా వెళ్లలేదని చెబుతుంటారు.
