హాట్ టాపిక్: లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సీనా?
‘కేజీఎఫ్-2’ రిలీజైన నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వేటకు రాబోతున్నాడు కన్నడ స్టార్ యశ్.
By: Garuda Media | 9 Jan 2026 12:00 AM IST‘కేజీఎఫ్-2’ రిలీజైన నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వేటకు రాబోతున్నాడు కన్నడ స్టార్ యశ్. ఐతే కేజీఎఫ్ ఫ్రాంఛైజీకి ఫాలో అప్‌గా అతను సరైన సినిమానే ఎంచుకున్నాడా అనే విషయంలో ముందు నుంచి సందేహాలున్నాయి. అతను ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్‌ను ఎంచుకోవడం చాలామంది అభిమానులకు నచ్చలేదు. తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన యశ్‌ను గీతు సరిగా డీల్ చేయగలదా అన్నది వాళ్ల అనుమానం.
గీతు మలయాళంలో తీసిన రెండు సినిమాలు అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సెన్సిబుల్‌గా సాగుతాయి. అలాంటి దర్శకురాలు యశ్ లాంటి మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తుందో.. సినిమాలో హీరోయిక్, మాస్ మూమెంట్స్ ఉంటాయో లేదో అనుకున్నారు ఫ్యాన్స్. ఐతే ఇలా అనుమానించిన వాళ్లకు సమాధానమా అన్నట్లు ఈ రోజు ఒక వయొలెంట్ టీజర్‌తో అందరికీ పెద్ద షాకే ఇచ్చింది ‘టాక్సిక్’ టీం.
‘టాక్సిక్’ టీజర్లో విజువల్స్, ఫ్రేమ్స్ అన్నీ కూడా హాలీవుడ్ సినిమాలను తలపించాయి. చాలా స్టైలిష్‌గా అదే సమయంలో మాసీగా ఉండేలా టీజర్‌ను కట్ చేశారు.
కానీ ఇందులో హీరో ఎంత వయొలెంటో చెప్పడానికి పెట్టిన ఒక షాట్ మాత్రం అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. కార్లో అమ్మాయితో వైల్డ్ రొమాన్స్ చేస్తూ.. దాని ద్వారా వచ్చే బంప్స్ ద్వారా క్లైమోర్‌మెన్ పేల్చడం అనే థాట్‌కు సోషల్ మీడియా జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇలాంటి వైల్డ్ థాట్ ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పొచ్చు. అందులోనూ ఒక స్టార్ హీరో సినిమాలో ఇలాంటి షాట్ పెట్టడం అనూహ్యం.
ఇలాంటి సీన్ సందీప్ రెడ్డి వంగ తీస్తే పెద్దగా ఆశ్చర్యపోయేవాళ్లు కాదు కానీ.. గీతు మోహన్ దాస్ లేడీ డైరెక్టర్ తన సినిమాలో ఇలాంటి సీన్ పెట్టడం మాత్రం షాకింగే. నెటిజన్లలో ఒక వర్గం ఇదెక్కడి మాస్ రా మామా అంటూ ఊగిపోతుంటే.. ఇంకో వర్గం ఇండియన్ సినిమాను భ్రష్టు పటిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రెస్పాన్స్ మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ.. ఈ టీజర్ ఈ రోజు టాక్సిక్ సినిమా పేరు సోషల్ మీడియాలో మార్మోగేలా చేసిందన్నది మాత్రం వాస్తవం.
