Begin typing your search above and press return to search.

గ్లోబ్ ట్రాటర్ క్రేజ్.. యూజ్ చేసుకుంటున్న యంగ్ హీరో

గ్లోబ్ ట్రాటర్.. SSMB 29.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా పేరే వినిపిస్తోంది. అదే మ్యానియా నడుస్తోంది.

By:  M Prashanth   |   15 Nov 2025 10:11 AM IST
గ్లోబ్ ట్రాటర్ క్రేజ్.. యూజ్ చేసుకుంటున్న యంగ్ హీరో
X

గ్లోబ్ ట్రాటర్.. SSMB 29.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా పేరే వినిపిస్తోంది. అదే మ్యానియా నడుస్తోంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ మూవీ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీగా గ్లోబ్ ట్రాటర్ కార్యక్రమం జరగనుంది.





అందుకు గాను ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అతి పెద్ద స్టేజ్, డిజిటల్ స్క్రీన్ ను సిద్ధం చేశారు. అంతే కాదు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్యక్రమానికి ఎలా చేరుకోవాలో కూడా రూట్ మ్యాప్ తో వివరిస్తూ ఎంట్రీ పాస్ (పాస్ పోర్ట్)ను సిద్ధం చేశారు.

రాజమౌళి, మహేష్ బాబు.. వీడియో సందేశాలు కూడా రిలీజ్ చేసి జాగ్రత్తలు చెప్పారు. మొత్తానికి ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎంత స్పెషల్ గా, జాగ్రత్తగా ఆలోచిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెంట్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. అయితే ఆ క్రేజ్ ను ఇప్పుడు మిగతా హీరోలు కూడా కొందరు యూజ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

అందులో భాగంగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సింగర్ గీతా మాధురి భర్త శ్రీ నందు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి.. ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు శ్రీ నందు. డిసెంబర్ 12వ తేదీన ఆ సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

రీసెంట్ గా టీజర్ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు ముందు ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో కాచిగూడలో పానీ పూరి బండి ఏదైతే ఉందో.. తాను రావడానికి మూడు రూట్లు ఉన్నాయంటూ ఫన్నీగా స్టార్ట్ చేశారు. చాదర్ ఘాట్ నుంచి మూసీ నదిపై బ్రిడ్జి నుంచి రావొచ్చని చెప్పారు. ఆ తర్వాత సుల్తాన్ బజార్ నుంచి వస్తే.. తనకు కూడా రూట్ తెలియదని అన్నారు.

పానీ పూరి తిన్నాక.. ప్యూజ్ డాల్ దో అంటూ కుదరదని చెప్పారు. చివరగా సైక్ సిద్ధార్థ్ ఈవెంట్ కు వస్తే జియో హాట్ స్టార్ లైవ్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను చూపిస్తామని తన మూవీని ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు నందు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. సూపర్ భయ్యా, బాగా ప్రమోట్ చేసుకుంటున్నావని కామెంట్లు పెడుతున్నారు.