'ది రెడ్ బ్యాగ్' నుంచి 'డిస్కో లైట్' సాంగ్.. కేక పుట్టిస్తున్న పార్టీ ట్రాక్!
కబీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రెడ్ బ్యాగ్' నుంచి ప్రమోషనల్ అప్డేట్స్ స్పీడందుకున్నాయి.
By: M Prashanth | 27 July 2026 9:27 PM ISTకబీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రెడ్ బ్యాగ్' నుంచి ప్రమోషనల్ అప్డేట్స్ స్పీడందుకున్నాయి. మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్షలతో పాటు పలువురు యంగ్ యాక్టర్లు ఇందులో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ టీమ్, లేటెస్ట్ గా 'డిస్కో లైట్' అనే క్రేజీ పార్టీ సాంగ్ ను ఆడియన్స్ ముందుకు తెచ్చింది.
ఫుల్ ఆన్ మాస్ అండ్ యుఫోరిక్ వైబ్స్ తో వచ్చిన ఈ 'డిస్కో లైట్' పాట వినగానే రిపీట్ మోడ్ లో వినేలా ఉంది. పార్టీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటలో కబీర్ సింగ్ తో పాటు హీరోయిన్లు తమ డాన్స్ మూవ్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ని బాగా ఎలివేట్ చేశారు. శేఖర్ మోపురి కంపోజ్ చేసిన ఈ ట్రాక్ లో బీట్స్, రిథమ్స్ ప్రతి ఒక్కరినీ డాన్స్ ఫ్లోర్ వైపు అడుగులు వేయించేలా డిజైన్ చేశారు. ప్రమోషన్స్ లో ఈ పాట సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ పాటకు మెయిన్ హైలైట్ స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్. క్లబ్, పార్టీ మోడ్ కి సరిపోయేలా క్యాచీ పదాలతో ఆయన రాసిన లైన్స్ ఇన్స్టంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతున్నాయి. దీనికి ప్లస్ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి తన ఎనర్జెటిక్ వాయిస్ తో పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. శేఖర్ మోపురి ట్యూన్, గీతా మాధురి సింగింగ్ కాంబో సాంగ్ ని యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలబెట్టేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాలో లీడ్ కాస్ట్ ప్రెజెన్స్ తో పాటు విజువల్స్ కూడా చాలా రిచ్ గా ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. డీఓపీ ప్రియేష్ గురుస్వామి కెమెరా వర్క్ పాటలోని కలర్ ఫుల్ సెటప్ ని చాలా స్టైలిష్ గా చూపించారు. యంగ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైబ్స్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ రవి కుమార్ సీరపు ఈ చిత్రాన్ని ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు సమాచారం.
ప్రొడ్యూసర్ హరికృష్ణ సోమిశెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. క్రైమ్, మిస్టరీ, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్ గా మిక్స్ చేసి థియేటర్లలో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాను రెడీ చేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ 'ది రెడ్ బ్యాగ్' టీమ్, త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సర్ ప్రైజింగ్ అప్డేట్స్ తో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ డిస్కో లైట్ తో హడావుడి స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ థియేటర్ల దగ్గర ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
