Begin typing your search above and press return to search.

గీత 'కాఫీ షాప్' కామెంట్స్.. ఎవరి రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది?

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను చాలా అరుదుగా కొన్ని కాఫీ షాప్స్‌ కు వెళ్తానని చెప్పింది.

By:  M Prashanth   |   24 April 2026 9:18 AM IST
గీత కాఫీ షాప్ కామెంట్స్.. ఎవరి రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది?
X

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను చాలా అరుదుగా కొన్ని కాఫీ షాప్స్‌ కు వెళ్తానని చెప్పింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రేమ జంటలు కనిపిస్తాయని, తాను నోరు తెరిస్తే కొన్ని రిలేషన్‌ షిప్స్‌ కు ఎండ్ కార్డ్ పడిపోతుందని చెప్పుకొచ్చారు.

ఆమె కామెంట్స్ తో నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిటీలో ప్రముఖులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు కొన్నే ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో అనేక కాఫీ షాప్స్, హ్యాంగౌట్ స్పాట్స్ ఏర్పడ్డాయి. వీటిలో సెలబ్రిటీలు, వారి స్నేహితులు తరచుగా కనిపిస్తుంటారు.

ఇదే విధంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా కొంతమంది సెలబ్రిటీలు వెళ్లే కేఫేలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలు చాలా మందికి తెలిసినవే కావడంతో, అక్కడ జరిగే విషయాలు పూర్తిగా రహస్యంగా ఉండడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గీతా మాధురి చేసిన వ్యాఖ్యలపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ నిజంగానే అలాంటి విషయాలు ఉంటే, అక్కడికి తరచుగా వెళ్లే ఇతర సెలబ్రిటీలు, మీడియా వ్యక్తులకు ముందుగానే అవి తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. పైగా ఆమె స్వయంగా చెప్పినట్లే తాను అరుదుగా మాత్రమే ఆ కాఫీ షాప్స్‌ కు వెళ్తుంటే, ఇలాంటి విషయాలు తనకే ప్రత్యేకంగా తెలిసే అవకాశం ఎంత వరకు ఉంటుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కూడా గీత వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెను కామెంట్స్ ను సరదాగా తీసుకుంటూ, ఇది కేవలం ఓ అతిశయోక్తి కావచ్చని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం, సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం కాస్త ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల గురించి ఇలా వ్యాఖ్యానించడం అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇక సినీ వర్గాల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించడం కొత్త విషయం కాదు. అభిమానులు, మీడియా దృష్టి ఎప్పుడూ వారిపై ఉండే నేపథ్యంలో, ఏ చిన్న విషయం అయినా త్వరగా బయటకు వచ్చే అవకాశముంది. అలాంటప్పుడు తాను చెప్పితేనే బయట పడే రహస్యాలు ఉన్నాయన్న భావన కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గీతా మాధురి చేసిన వ్యాఖ్యల పట్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు. ఆ కామెంట్స్‌ ను చాలామంది సీరియస్‌ గా తీసుకోవడం కన్నా, ఓవర్ స్టేట్మెంట్‌ గా భావిస్తున్నారు. సెలబ్రిటీలు చేసే ప్రతి వ్యాఖ్య కూడా ప్రజల్లో చర్చకు దారి తీస్తుందనే విషయం మరోసారి స్పష్టమైంది.