రష్మిక మెడలో తాళి.. చేతులు వణికాయంటున్న విజయ్
గీత గోవిందం ప్రమోషన్స్ టైమ్ లో విజయ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. సినిమాలో పెళ్లి సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు అది సాధారణ షూటింగ్‌లా అనిపించలేదని చెప్పాడు.
By: Sravani Lakshmi Srungarapu | 9 May 2026 7:00 PM ISTటాలీవుడ్‌లో అభిమానులు అత్యంత ఇష్టపడే జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పేరు ముందు వరుసలో ఉంటుంది. గీత గోవిందం సినిమా నుంచి మొదలైన వీరి అనుబంధం ఇప్పుడు నిజ జీవితంలోనూ ప్రత్యేక స్థాయికి చేరుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ, గతంలో ఆయన చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య మరోసారి వైరల్‌గా మారింది. గీత గోవిందం షూటింగ్ టైమ్ లో రష్మిక మెడలో తాళి కట్టే సీన్ తనను ఎంతగా టెన్షన్‌కు గురి చేసిందో విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీశాయి.
గీత గోవిందం ప్రమోషన్స్ టైమ్ లో విజయ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. సినిమాలో పెళ్లి సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు అది సాధారణ షూటింగ్‌లా అనిపించలేదని చెప్పాడు. చుట్టూ పెళ్లి మండపం, సంప్రదాయ అలంకరణలు, పట్టు వస్త్రాలు, ఫ్యామిలీ వాతావరణం అన్నీ కలిసి నిజంగానే పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ ఇచ్చాయని తెలిపాడు. ముఖ్యంగా రష్మిక మెడలో మూడు ముళ్లు వేయాల్సిన సమయంలో తన చేతులు వణికిపోయాయని చెప్పడం అప్పట్లోనే వైరల్ అయింది. తాను అంత టెన్షన్ పడుతుంటే, అప్పటికే సినిమాల్లో పలుమార్లు పెళ్లి సీన్లు చేసిన రష్మిక మాత్రం చాలా కూల్‌గా ఉందని, ఆమెనే తనకు ధైర్యం చెప్పిందని విజయ్ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు.
అయితే అప్పట్లో ఫ్యాన్స్ కు సరదాగా అనిపించిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మరో కోణంలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఏడేళ్ల తర్వాత అదే రష్మికను విజయ్ నిజ జీవితంలో తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.
ఇక ప్రొఫెషనల్‌గా కూడా ఈ జంట ప్రయాణం కొనసాగుతూనే ఉంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఇప్పుడు మరోసారి రణబాలి సినిమాలో కలిసి నటిస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ ఎప్పుడూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడంతో, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు షూటింగ్‌లో తాళి కట్టే సీన్‌కు భయపడ్డ విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో అదే బంధాన్ని నిజం చేసుకున్నాడనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.
