బిగ్ ప్రాజెక్టుతో మరో యాంకర్ సినీ ఎంట్రీ.. ఎవరో తెలుసా?
స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్.. కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న యాంకర్ల లిస్ట్ పెరుగుతుందనే చెప్పాలి.
By: M Prashanth | 27 Feb 2026 1:21 PM ISTస్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్.. కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న యాంకర్ల లిస్ట్ పెరుగుతుందనే చెప్పాలి. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాక టీవీ వైపు మళ్లిన యాక్ట్రెస్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్,హోస్టింగ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని, ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో స్టార్ తెలుగు యాంకర్ వెండితెరకు పరిచయం కానున్నారు.
గతంలో బుల్లితెరపై యాంకర్స్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల, ఝాన్సీ, మంజూష వంటి వారు ఉన్నారు. వీరు టీవీ యాంకర్లుగా మంచి పేరు తెచ్చుకుని, ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించారు. అప్పట్లో మూవీ అవకాశాలు తగ్గడంతో టీవీని ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. ఫాలోయింగ్ పెంచుకుని, సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు.
రీసెంట్ గా పలువురు యాంకర్లు అలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా లుక్స్, స్టేజ్ షోలతో పాపులర్ అయిన యాంకర్ స్రవంతి చొక్కారపు.. హే బల్వంత్ సినిమాలో విభిన్న పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ మూవీలో ఆమె పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరికొంత మంది యాంకర్లు కూడా సినీ అవకాశాలపై దృష్టి పెడుతున్నారు.
ఇప్పుడు మరో ప్రముఖ యాంకర్ గీతా భగత్ నటిగా ఎంట్రీ ఇస్తున్నారు. టెలివిజన్ షోలు, ఈవెంట్ హోస్టింగ్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గీతా భగత్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె స్టైల్, ప్రెజెన్స్ కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే క్రేజ్ ఆమెకు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆమె నటించబోయే సినిమా కూడా చిన్న, మిడ్ రేంజ్ మూవీ కూడా కాదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో గీతా భగత్ సినీ జర్నీ స్టార్ట్ కావడం విశేషం. సాధారణంగా కొత్తవారికి చిన్న సినిమా ద్వారా డెబ్యూ ఛాన్స్ దక్కుతుంటుంది.
కానీ గీతా భగత్ మాత్రం తొలి మూవీనే స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది కూడా కీలక పాత్ర దక్కడం విశేషం. ఏదేమైనా టీవీ యాంకర్లు వరుసగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి గీతా భగత్ యాక్టింగ్ ఎలా ఉంటుందో.. ఎంతలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
